Top Stories

అర్జెంటుగా అధ్య‌క్షులు ఎందుకు? కేసీఆర్‌లో భ‌యం జొచ్చిందా?

టీఆర్ఎస్ పార్టీ ఏర్పడి 20 ఏండ్లు దాటింది. తెలంగాణ రాష్ట్రం సాకార‌మై ఏడేండ్లు గ‌డుస్తోంది. తెలంగాణ‌లో త‌మ‌దే తిరుగులేని పార్టీగా చెప్పుకునే కేసీఆర్‌.. స్వ‌రాష్ట్రం వ‌చ్చాక‌ ఇంత‌వ‌ర‌కూ టీఆర్ఎస్‌ జిల్లా అధ్య‌క్షుల‌ను నియ‌మించింది లేదు. రాష్ట్ర కార్య‌వ‌ర్గ‌మే కానీ.. కాంగ్రెస్‌లో మాదిరి జిల్లాల స్థాయిలో బ‌ల‌మైన వ్య‌వ‌స్థ మాత్రం లేదు. జిల్లా అధ్య‌క్షులు అవ‌స‌ర‌మేలేద‌ని గ‌తంలో ఓ సంద‌ర్భంలో కేసీఆర్ అన్నారు కూడా. అలాంటిది.. ఇప్పుడు స‌డెన్‌గా 33 జిల్లాల‌కు టీఆర్ఎస్ అధ్య‌క్షుల‌ను నియ‌మించ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. అదికూడా రిప‌బ్లిక్ డే రోజున‌.. అంత సీక్రెట్‌గా ఆ లిస్ట్ రిలీజ్ చేయాల్సిన అవ‌స‌రం ఏమొచ్చింద‌నేది మ‌రో అనుమానం. ఓవైపు కాంగ్రెస్, బీజేపీలు ప్ర‌గ‌తిభ‌వ‌న్‌పై దండయాత్ర చేస్తున్నాయి. రేవంత్‌రెడ్డి కేసీఆర్‌పై రంకెలేస్తున్నారు. బండి సంజ‌య్ గేరు మార్చి ఫుల్ రేజింగ్‌లో ఉన్నారు. స్టేట్ లెవెల్‌లో వీరిద్ద‌రూ కొట్లాడుతుంటే.. క్షేత్ర స్థాయిలో ఆయా పార్టీల కేడ‌ర్ దూకుడుగా ధ‌ర్నాలు, నిర‌స‌న‌లు చేస్తున్నాయి. అయితే, ప్ర‌తిప‌క్షాల దాడిని కాచుకోవ‌డంలో గులాబీ కేడ‌ర్ పూర్తిగా విఫ‌లం అవుతోంద‌నే చెప్పాలి. కేసీఆర్ ఒక్క‌డే ప్ర‌గ‌తిభ‌వ‌న్‌లోనో, తెలంగాణ భ‌వ‌న్‌లోనో ప్రెస్‌మీట్లు పెట్టి ఫైర్ అవుతున్నారు గానీ, జిల్లాల స్థాయిలో ఇటు ప్ర‌భుత్వం, అటు పార్టీ ప‌రంగా బ‌ల‌మైన వాయిస్ వినిపించే వారు క‌రువ‌వుతున్నారు. వ‌రిపై కేంద్రంతో యుద్ధాన్ని ప్ర‌క‌టించిన కేసీఆర్‌.. తానొక్క‌డే ఫైట్ చేస్తున్నారు కానీ, ఆయ‌న త‌ర‌ఫున ప్ర‌జ‌ల్లో అవేర్‌నెస్ క్రియేట్ చేసేందుకు గానీ, రైతుల‌ను జ‌త‌క‌ట్టి కేంద్రం, బీజేపీపై ఎదురుదాడి చేసేందుకు గానీ, కాంగ్రెస్ విమ‌ర్శ‌ల‌కు ధీటుగా బ‌దులిచ్చేందుకు గానీ.. గులాబీ కేడ‌ర్ ముందుకు రావ‌డం లేదు. ఆ.. మాకెందుకులే.. అంతా కేసీఆరే చూసుకుంటారులే.. అనే ఉదాసీన‌త టీఆర్ఎస్ శ్రేణుల్లో క‌నిపిస్తోంది. జిల్లా స్థాయిలో ప‌టిష్ట‌మైన పార్టీ నెట్‌వ‌ర్క్ లేక‌పోవ‌డం.. ఎవ‌రికీ జిల్లా బాధ్య‌త‌లు అప్ప‌గించ‌క‌పోవ‌డ‌మే అందుకు కార‌ణ‌మ‌ని కేసీఆర్ చాలా ఆల‌స్యంగా గుర్తించినట్టున్నారు. మ‌రో వాద‌నా వినిపిస్తోంది. సీఎం కేసీఆర్ త్వ‌ర‌లోనే ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు వెళ‌తారంటూ గ‌త కొంత‌కాలంగా ప్ర‌చారం జ‌రుగుతోంది. తాజా ప‌రిణామం అందుకు మ‌రింత బ‌లం చేకూర్చుతోంది. జిల్లా అధ్య‌క్షుల‌ను ప్ర‌క‌టించి.. క్షేత్ర స్థాయిలో పార్టీని ప‌టిష్టం చేసి.. అంతా ఓకే అనుకున్నాక‌.. ప్ర‌తిప‌క్షాల‌కు ఛాన్స్ ఇవ్వ‌కుండా.. స‌డెన్‌గా ప్ర‌భుత్వాన్ని ర‌ద్దు చేసి గ‌తంలో మాదిరి ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు వెళ్లాల‌నేది కేసీఆర్ వ్యూహం అని కొంద‌రు విశ్లేషిస్తున్నారు. లాస్ట్ ట‌ర్మ్ ఎల‌క్ష‌న్స్‌లో కాస్త ఫీల్ గుడ్ ఎన్విరాన్‌మెంట్ ఉంది కాబ‌ట్టి స‌రిపోయింది. ఈసారి ప‌రిస్థితి దారుణంగా ఉంది. కేసీఆర్ పాల‌న‌పై ప్ర‌జ‌ల్లో తీవ్ర వ్య‌తిరేక‌త నెల‌కొంది. అన్నివ‌ర్గాల ప్ర‌జ‌లు ఆయ‌న‌పై ఆగ్ర‌హంతో ర‌గిలిపోతున్నారు. వ‌రి వేస్తే ఉరి అన్నందుకు రైతులు.. ఉద్యోగాలు లేనందుకు నిరుద్యోగులు.. కొత్త పింఛ‌న్లు, రేష‌న్ కార్డులు లేక పేద‌, మ‌ధ్య‌త‌ర‌గ‌తి వ‌ర్గాలు.. ద‌ళిత బంధు అంద‌రికీ ఇవ్వ‌క ద‌ళితులు.. గొర్రెల పంపిణీ లేక యాద‌వులు.. ఇలా దాదాపు అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌లు కేసీఆర్ పాల‌న‌పై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. అదే స‌మ‌యంలో.. దూకుడు మీదున్న కాంగ్రెస్‌, బీజేపీల వైపు ఆశ‌గా చూస్తున్నారు.  స‌ర్వేల‌తో ఆ విష‌యం గుర్తించిన కేసీఆర్‌.. పార్టీ యంత్రాంగంతో ప్ర‌భుత్వ అనుకూల ప్ర‌చారం చేయించి.. ప్ర‌జావ్య‌తిరేక‌తను త‌గ్గించుకోవాల‌ని చూస్తున్నారు. ప్ర‌జ‌లు రేవంత్‌రెడ్డి వైపో, బండి సంజ‌య్ వైపో చూడ‌కుండా.. నిత్యం కాంట్ర‌వ‌ర్సీల‌తో పొలిటిక‌ల్ అటెన్ష‌న్ త‌న‌వైపున‌కే తిప్పుకుంటున్నారు. విప‌క్షాల‌కు క‌ట్ట‌డి చేసి.. ధీటుగా ప్ర‌తివిమ‌ర్శ‌లు చేసేందుకే.. ఏడేళ్లుగా లేని జిల్లా పార్టీ అధ్య‌క్ష ప‌ద‌వుల‌ను హ‌డావుడిగా ప్ర‌క‌టించార‌ని అంటున్నారు.  తెలంగాణలోని 33 జిల్లాలకు టీఆర్ఎస్‌ అధ్యక్షులను సీఎం కేసీఆర్ ప్రకటించారు. 19 మంది ఎమ్మెల్యేలకు.. ముగ్గురు ఎంపీలకు.. అలాగే ముగ్గురు జడ్పీ చైర్మన్లకు, ఇద్దరు ఎమ్మెల్సీలకు జిల్లా అధ్యక్ష పదవులు లభించాయి. ఇందులోనూ జ‌న‌గామ‌, ఖ‌మ్మం, ములుగు లాంటి జిల్లాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేల‌కు, ఆశావ‌హుల‌కు షాకులు త‌ప్ప‌లేదు. 
Publish Date: Jan 26, 2022 1:00PM

పుష్ప‌కు క్రికెట‌ర్లు ఫిదా.. బంగ్లాదేశ్‌ ప్రీమియర్‌ లీగ్‌లోనూ స్టెప్పులు..

పుష్ప ఫీవ‌ర్ ఇప్పుడు అంద‌రినీ వెంటాడుతోంది. పుష్ప మేన‌రిజం, స్టెప్పులకు అంతా ఫిదా అయిపోయారు. క్రికెట‌ర్ల‌కూ ఆ ఫీవ‌ర్ ప‌ట్టుకుంది. విదేశీ ఆట‌గాళ్లు సైతం పుష్ప‌ను ఫాలో అవుతుండ‌టం ఆస‌క్తిక‌రం.  బంగ్లాదేశ్ ప్రీమియర్‌ లీగ్‌ (బీపీఎల్‌)లో పుష్పా ట్రెండ్ న‌డుస్తోంది. ఓ మ్యాచ్‌లో వెస్టిండీస్‌ ఆల్‌రౌండర్‌ డీజే బ్రావో ‘పుష్ప’ స్టెప్పులేయగా.. మరో మ్యాచ్‌లో బంగ్లాదేశ్ ప్లేయ‌ర్‌ నజ్ముల్ ఇస్లాం కూడా అదే విధంగా స్టెప్పులేసి అలరించారు.   బంగ్లాదేశ్‌ ప్రీమియర్‌ లీగ్‌లో భాగంగా కొమిల్లా విక్టోరియన్స్ (సీవీ)‌, ఫార్చ్యూన్‌ బరిషల్‌ జట్ల మధ్య మంగళవారం మ్యాచ్ జ‌రిగింది. ఫార్చ్యూన్‌ బరిషల్ తరఫున ఆడుతున్న డీజే బ్రావో.. ప్ర‌త్య‌ర్థి జ‌ట్టు బ్యాట్స్‌మెన్‌ను క్యాచ్‌ ఔట్ చేశాడు. ఆ వెంట‌నే పుష్ప మూవీలోని శ్రీవల్లి సాంగ్‌కు స్టెప్పులేస్తూ సంబరాలు చేసుకున్నాడు బ్రావో. మ‌రో మ్యాచ్‌లో సైతం ఇలానే జ‌రిగింది. సన్‌రైజర్స్‌ బౌలర్‌ నజ్ముల్ ఇస్లాం వేసిన బంతికి.. బరిషల్ ఆటగాడు మహ్మదుల్లా క్యాచ్‌ ఔటయ్యాడు. దీంతో నజ్ముల్ తగ్గేదేలేదన్నట్టు.. పుష్ప మేన‌రిజంలా మెడ‌కింద చేతులు వేసి స‌వాల్ చేశాడు. ఇలా బంగ్లాదేశ్ ప్రీమియ‌ర్ లీగ్‌ను పుష్ప ఊపేస్తోంది. ఇక ఇంత‌కుముందే టీమ్‌ఇండియా ఆటగాళ్లు శిఖర్‌ ధావన్‌, రవీంద్ర జడేజా, ఇషాన్ కిషన్‌, ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్‌లు.. పుష్ప పాటలకు స్టెప్పులేసి సంద‌డి చేసిన వీడియోలు తెగ వైర‌ల్ అయ్యాయి. ఎంతైనా పుష్పానా.. మ‌జాకా.. త‌గ్గేదేలే..!!
Publish Date: Jan 26, 2022 12:01PM

ఈసారి రిప‌బ్లిక్ డే ప్ర‌త్యేక‌త‌లు ఇవే.. ఔరా అనిపించాల్సిందే..

దేశ రాజధాని ఢిల్లీలో 73వ గణతంత్ర వేడుకలు ఘ‌నంగా జ‌రిగాయి. దేశ ప్రథమ పౌరుడు, రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ప్రధానమంత్రి నరేంద్రమోదీ జాతీయ ప‌తాకానికి వందనం చేసి వేడుకలు ప్రారంభించారు. విశిష్ట సేవలందించిన వారికి రాష్ట్రపతి పురస్కారాలు ప్రదానం చేశారు.  2020 ఆగస్టులో ముగ్గురు ఉగ్రవాదులను హతమార్చిన జమ్మూకశ్మీర్‌ పోలీసు ఏఎస్‌ఐ బాబురామ్‌కు మ‌ర‌ణానంత‌రం అశోక్‌ చక్ర పురస్కారం వరించింది. బాబురామ్‌ కుటుంబసభ్యులు రాష్ట్రపతి చేతుల మీదుగా పురస్కారాన్ని స్వీకరించారు.    రాజ్‌పథ్‌లో రిప‌బ్లిక్ డే పరేడ్ వేడుక‌గా జ‌రిగింది. దేశ సైనిక సామర్థ్యాన్ని చాటి చెప్పేలా పరేడ్‌ను ఘనంగా నిర్వహించారు. వాయుసేన విన్యాసాలు, శకటాల ప్రదర్శనతో పరేడ్‌ ఆకట్టుకుంది.    దేశానికి స్వాతంత్య్రం వచ్చి ఈ ఏడాదికి 75ఏళ్లు పూర్తికానుంది. ఈ సందర్భంగా ‘ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా 73వ గణతంత్ర వేడుకల్లో పలు ప్రత్యేకతలు చోటుచేసుకున్నాయి.   రిపబ్లిక్‌ డే కవాతులో మొదటిసారిగా భారత వాయుసేనకు చెందిన 75 విమానాల విన్యాసాలు జరిగాయి. పాత విమానాల నుంచి ఆధునిక రఫేల్‌, సుఖోయ్‌, జాగ్వార్ ఫైట‌ర్ జెట్‌లు ప్ర‌ద‌ర్శ‌న ఇచ్చాయి.  ప్రతి ఏటా ఉదయం 10 గంటలకు పరేడ్‌ను ప్రారంభిస్తారు. ఈసారి ఢిల్లీలో వాతావరణ పరిస్థితుల దృష్ట్యా అరగంట ఆలస్యంగా వేడుక‌లు స్టార్ట్ చేశారు.  దేశవ్యాప్తంగా పోటీల్లో ఎంపిక చేసిన 480 బృందాలతో సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వ‌హించారు.  రక్షణ, సాంస్కృతిక మంత్రిత్వశాఖల ఆధ్వర్యంలో 600 మంది ప్రముఖ చిత్రకారులు రూపొందించిన చిత్రాలు ప్రదర్శించారు.   రాజ్‌పథ్‌ మార్గంలో ఇరువైపులా పది భారీ ఎల్‌ఈడీ స్క్రీన్స్‌ ఏర్పాటు చేశారు. గణతంత్ర వేడుకల విశేషాలు, సాయుధ దళాలపై చిత్రీకరించిన లఘు చిత్రాలను ప‌రేడ్ ప్రారంభానికి ముందు ఎల్‌ఈడీ తెరలపై ప్రదర్శించారు.   అంత‌కుముందు, గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్రమోదీ, రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ అమరవీరులకు నివాళులర్పించారు. ఇండియాగేట్‌ సమీపంలోని జాతీయ యుద్ధ స్మారకాన్ని సందర్శించి దేశం కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరులకు వందనం చేశారు. 
Publish Date: Jan 26, 2022 11:23AM

ప‌ద్మ‌విభూష‌ణ్ 'కృష్ణ ఎల్లా' గురించి ఈ విష‌యాలు తెలుసుకోవాల్సిందే?

కొవాగ్జిన్ తయారీ సంస్థ‌ భారత్ బయోటెక్‌కు సీఎండీ కృష్ణ ఎల్లా, జేఎండీ సుచిత్ర ఎల్లా. ఔషధ రంగంలో విశేష కృషి చేసిన వారిద్దరినీ సంయుక్తంగా పద్మవిభూషణ్ వరించింది. కేంద్ర ప్రభుత్వం పద్మ విభూషణ్ ప్రకటించడంతో వారిద్దరి కృషికి ప్రశంసలు దక్కినట్లయింది. తమిళనాడులోని తిరుత్తణి దగ్గర ఓ పల్లెలో సాధారణ వ్యవసాయ కుటుంబంలో జన్మించారు కృష్ణ ఎల్లా. వ్యవసాయం మీద కృష్ణ ఎల్లకు మక్కువ ఎక్కువ. ఆ మక్కువతోనే ఆయన వ్యవసాయ శాస్త్రంలో ఉన్నత చదువులు చదివారు. కుటుంబం ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా బేయర్ ఫార్మా అగ్రికల్చర్ విభాగంలో కృష్ణ ఎల్లా ఉద్యోగంలో చేరారు. స్కాలర్ షిప్ రావడంతో అమెరికాలో ఎమ్మెస్ చేసి, పీహెచ్ డీ కూడా చేశారు. ఆ తరువాత తిరిగి భారతదేశానికి రాకూడదని ఆయన అనుకొన్నారట. అయితే..’ఏమన్నా చేసుకొందువు నీ ఇష్టం.. ఇండియాకు రమ్మన్న తల్లి మాట విని కృష్ణ ఎల్లా మాతృదేశానికి వచ్చేశారు. ఒక్క డాలర్ ధరకు వ్యాక్సిన్ తయారు చేస్తా అంటూ హైదరాబాద్ వచ్చి ఓ చిన్న ల్యాబ్ పెట్టుకొన్నారు కృష్ణ ఎల్ల. 12.5 కోట్ల అంచనాతో హెపటైటిస్ మందుల ప్రాజెక్టు ప్రపోజల్ పట్టుకొని పెట్టుబడి కోసం కృష్ణ ఎల్లా తిరిగారు. ఆయనను చూసి అందరూ నవ్వారు. చివరికి ఐడీబీఐ బ్యాంకు 2 కోట్లు రుణం ఇచ్చింది. నాలుగేళ్లు శ్రమించిన కృష్ణ ఎల్లా హైపటైటిస్ వ్యాక్సిన్ ను తయారు చేశారు. 1999లో ఏపీజే అబ్దుల్ కలాం వచ్చి ఆ వ్యాక్సిన్ ని మార్కెట్లోకి విడుదల చేయడం విశేషం. ఆ తరువాత 1996లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడిని కలిసి బయోటెక్ నాలెడ్జ్ పార్క్ ఏర్పాటు గురించి చ‌ర్చించారు కృష్ణ ఎల్లా. ఆయన సలహాతో హైదరాబాద్ నగర శివార్లలోని శామీర్ పేట్ రహదారి దగ్గర జీనోం వ్యాలీ వెలిసింది. జీనోమ్‌ వ్యాలీ రూపకల్పన కోసం చంద్రబాబు నాయుడు బాగా కృషి చేశారు. ఆ వ్యాలీ నుంచి 60 శాతానికి పైగా పిల్లల వ్యాక్సిన్ లు ప్రపంచానికి ఎగుమతులు అవుతున్నాయి. 65 దేశాలకు 400 మిల్లియన్ డోసుల ఎగుమతులు చేసింది భారత్ బయోటెక్ సంస్థ. క్రిష్ణ ఎల్లా భారత్ బయోటెక్ పేరుతో ముందు ఓ చిన్న ల్యాబ్ పెట్టుకున్నారు. దేశ భక్తితో పెట్టిన ఆ పేరుతో ఏర్పాటు చేసిన ఆ సంస్థ దేశం గర్వించేలా వందకు పైగా జాతీయ, అంతర్జాతీయ అవార్డులు సొంతం చేసుకొంది. చికున్ గున్యా నుండి జికా వైరస్ వరకు ఎన్నో వ్యాక్సిన్ లు కనిపెట్టి.. వైరస్ ల మీద దండయాత్రే చేశారు కృష్ణ ఎల్లా, సుచిత్ర ఎల్లా. వారిద్దరి సారథ్యంలో భారత్ బయోటెక్ సంస్త రూపొందించిన వ్యాక్సిన్లలో 65 పేటెంట్లు సాధించాయి. 2011 బిజినెస్ లీడర్, టెక్నాలజీ, ఇన్నోవేషన్ లో 2008లో ప్రధాని అవార్డును అందుకున్నారు. కృష్ణ ఎల్లా కరోనా మహమ్మారి నియంత్రణకు తిరుగులేని వ్యాక్సిన్ కొవాగ్జిన్ ను అభివృద్ధి చేశారు. భారత్ బయోటెక్ సంస్థ అతి తక్కువ ధరకే కొవాగ్జిన్ వ్యాక్సిన్ ను అందుబాటులోకి తెచ్చారు. కరోనా వైరస్ తో ప్రపంచం అతలాకుతలమైపోతున్న సమయంలో ప్రధాని మోదీ భారత్ బయోటెక్ సంస్థను సందర్శించడం ఓ పెద్ద న్యూసే అయింది.  హైదరాబాద్ పరిసరాల్లో 600 చదరపు కిలోమీటర్ల పరిధిలో జీనోం వ్యాలీ విస్తరించింది. ఐటి రంగానికి ధీటుగా వేలాది మందికి జీనోం వ్యాలీలో ఉపాధి లభిస్తోంది. ‘ఐ వాంట్ ఏపీ టు బీ నంబర్ వన్ ఇన్ బయోటెక్’ అని 2004 మార్చిలో చంద్రబాబు నాయుడు చెబితే కొంద‌రు న‌వ్వారు. ఇప్పుడా ఫ‌లితాలు చూస్తున్నారు. ఆ వ్యాలీలో విర‌బూసిన సంజీవ‌నే- కొవాగ్జిన్‌. ఆ టీకా సృష్టిక‌ర్త‌లు కృష్ణా ఎల్లా, సుచిత్ర ఎల్లాల‌కు ల‌భించిన గౌర‌వ‌మే- ప‌ద్మ‌విభూష‌ణ్‌.  
Publish Date: Jan 26, 2022 10:36AM

అయ్యేది కాదు.. కొత్త జిల్లాలతో పాత ఎత్తులు.. పనిచేస్తాయా?

అయ్యేది కాదు.. పొయ్యేది కాదు, అయినా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తేనే తుట్టెను కదిల్చింది. ఇప్పటికిప్పుడు కొత్త జిల్లాలను ఏర్పాటు చేయకపొతే కొంపలేవో మునిగి పోతునట్లు, ప్రస్తుతమున్న 13 జిల్లాలను 26 జిల్లాలుగా విభజించేందుకు రాష్ట్ర మంత్రివర్గం ఆగమేఘాల మీద  ‘ఆన్లైన్’ లో ఆమోదం తెలిపింది. అయితే, ఇది అయ్యేది కాదు. ఎందుకంటే, కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా జనాభా గణనకు 2020 జనవరిలో నోటిఫికేషన్‌ జారీ చేసింది. జనాభా లెక్కల ప్రక్రియ ముగిసే వరకు గ్రామాలు, పట్టణాల భౌగోళిక సరిహద్దులు మార్చకూడదంటూ ఫ్రీజింగ్‌ (నిషేధ) ఉత్తర్వులు ఇచ్చింది. కేంద్రం జరీ చేసినప్రీజింగ్ ఉత్తర్వుల మేరకు రాష్ట్ర రెవెన్యూ శాఖ కూడా ‘ఫ్రీజింగ్’ మోమో జారీ చేసింది. దీంతోనే జిల్లాల ఏర్పాటు ప్రక్రి య అధికారికంగా నిలిచిపోయింది.  అంటే దేశ వ్యాప్తంగా జనాభా లెక్కల ప్రక్రియ ముగిసే వరకు  కొత్త జిల్లల ఏర్పాటు కుదిరే పని కాదు. ఈ విషయం రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి, ఆయన గారి 40 మంది సలహాదారులకు తెలియదా? ఈ మేరకు కేబినెట్‌ నోట్‌’ను ఆన్లైన్’లో  సర్క్యులేట్ చేసిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మకు తెలియదా, ఆన్లైన్’లోనే ఆమోదం తెలిపిన మంత్రులకు తెలియదా అంటే అందరికీ తెలుసు. నిజానికి, ఇది కొత్త ట్రిక్ కాదు, గతంలోనూ ప్రయోగించి ఫెయిల్ అయిన పాత ట్రిక్కునే ప్రభుత్వం మళ్ళీ మరో మరో పైకి తీసింది.  నిజానికి, గతంలోనూ అప్పటి చిక్కులోంచి బయటపడేందుకు, ప్రజలదృష్టిని రియల్ ఇష్యూస్ నుంచి తప్పించేందుకు ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ప్రభుత్వం ఇదే ట్రిక్ ప్లే చేసింది. ఇటీవల రాష్ట్రంలోని అనేక ప్రాంతలను వరదలు ముంచెత్తిన సమయంలో ముఖ్యమంత్రి ప్యాలెస్ గడప దాటలేదు. ప్రజలను పట్టించుకోలేదు. ముఖ్యమంత్రి తీరును విపక్షాలు విమర్శించాయి. రోమ్ చక్రవర్తి ఫిడేలు రాగాలను గుర్తు చేసి దెప్పి పొడిచాయి. బాధిత ప్రజలు ఆందోళన వ్యక్తపరిచారు. ఆ సమయంలో అమరావతిలో జరిగిన ఎంపీల సమావేశంలో, ముఖ్యమంత్రి ‘కొత్తజిల్లాల అంశాన్ని ప్రస్తావించారు. కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ ఎంత వరకు వచ్చిందని ఆరా తీశారు. ఆ తర్వాత ఆ విషయం మరిచి పోయారు. అంతకు ముందు పంచాయతీ ఎన్నికల సమయంలోనూ కొత్త జిల్లాల అంశాన్ని తెర మీదకు తెచ్చారు. అయితే, అప్పటి ఎన్నికల అధికారి రమేశ్‌ కుమార్‌ ‘సెన్సస్‌’ డైరెక్టర్‌ ఇచ్చిన ఫ్రీజింగ్‌ ఉత్తర్వులు ఉండగా, ఎన్నికల సమయంలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ చేయడానికి వీల్లేదని అప్పటి సీఎ్‌సకు లేఖరాశారు. దీంతో ఆ ప్రక్రియను ఆపేశారు. ఫ్రీజింగ్‌ ఉత్తర్వులను ఇప్పటికీ కేంద్రం వెనక్కి తీసుకోలేదు. కరోనా కారణంగా జన గణన పూర్తిస్థాయిలో జరగడం లేదు. ఇప్పట్లో అయ్యే పరిస్థితి కూడా కనిపించడం లేదు. అయినా ప్రభుత్వం కొత్త జిల్లాల అంశాన్ని ఇప్పుడు ఎందుకు తెర మీదకు, తెచ్చింది? ఇదేమీ వెయ్యి డాలర్ల ప్రశ్న కాదు. ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ప్రభుత్వానికి ఏ దిక్కు చూసినా అష్టమ దిక్కే కనిస్తోంది. ఓ వంక, ఉద్యోగులు,ఉపాధ్యాయులు రోడ్లెక్కేందుకు సిద్ధమయ్యారు. పీఆర్సీ విషయంలో అన్యాయం జరిగిందని ఆగ్రహంతో ఉన్నారు. సమ్మె నోటీసు ఇచ్చారు. అయినా, ఉద్యోగులు గొంతెమ్మ కోర్కెలు కోరుతున్నారని, ఉద్యోగుల డిమాండ్స్ ఆమోదిస్తే, సంక్షేమ పథకాలు ఆగిపోతాయని చెప్పి, ఉద్యోగులను బూచిగా చూపించి ప్రజలను రెచ్చ గొట్టే ప్రయత్నం ప్రభుత్వం, అధికార పార్టీ చేశాయి. అయితే, తాతకు దగ్గులు నేర్పడం కుదిరే వ్యవహారం కాదని గుర్తు చేస్తూ ఉద్యోగులు, మాకసలు పీఆర్సీనే వద్దు,జీతం ఒక్క రూపాయి పెంచనూ వద్దు, పీఆర్సీ ఇస్తామంటున్న పది వేల కోట్ల రూపాయలను కూడా పేద ప్రజల సంక్షేమానికే ఖర్చు చేయండి, మాకు పాత జీతాలే ఇవ్వండి, అనే సరికి సర్కార్ పని కుడితిలో పడిన ఎలుకల మారింది. ఉద్యోగులను మోసం చేద్దామనుకుంటే అసలుకే మోసం వచ్చిందని అధికార పార్టీ అసంతృప్తులు అంటున్నారు.   మరో వంక గుడివాడ కాసినో వివాదం ముదిరి పాకన పడుతోంది. మంత్రి కొడాలి నానీ, పూటకో అడుగు పక్కకు వేస్తున్నారు. ప్రభుత్వం మెడకు గుదిబండగా మారుతున్నారు, అనే మాట వినవస్తోంది. కాసినో తీగ లాగితే డొంకంతా కదులుతోంది. నానీ, గత ‘చరిత్ర; చిట్టా  మొత్తం బయటకు వస్తోంది. ఇంత కాలం అంతగా వినిపించని ఆయన భూకబ్జాలు,అవినీతికి   సంబందించిన అనేక ఆరోపణలు ఇప్పుడు తెరమీదకు వస్తున్నాయి. ఇక రాష్ట్ర ఆర్థిక పరిస్థితి విషయం అయితే చెప్పనే అక్కరలేదు. ఇవిగాక ఇంకా గా  నిగూడంగా ఉన్న చిక్కు ముళ్ళు ఎన్ని ఉన్నాయో తెలియదు. ఈ నేపధ్యంలోనే ప్రభుత్వం కొత్త జిల్లాల అంశాన్ని మరో మారు తెరమీదకు తెచ్చింది. అయితే, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గానీ, మరొకరు కానీ, ‘చీటింగ్ ఈజ్ ది సీక్రెట్ అఫ్ మై సక్సెస్’ అనుకుంటే అన్ని సందర్భాలో అది సాధ్యం కాదు. ఇప్పుడు, ఇది కూడా అంతే .. అంటున్నారు.
Publish Date: Jan 26, 2022 9:56AM

చలికాలంలో ఎందుకు వణుకుతాం ?

  ఈ మధ్య కలాం లో తీవ్రమైన చలి పెరిగిపోయింది. దీనికారణంగా మనం భరించరాని చలిలో ఉన్నప్పుడు మన శరీరం వణుకు తుంది. దంతాలు కటకటా కొట్టుకుంటాయి. ఇలా ఎందుకు జరుగుతుంది.  *శరీరం వణకడం దంతాలు కొట్టుకోవటమూ మనశరీరం లో వేడి ఉత్పత్తి కావటానికి జరిగే చర్యలు. బయటి నుంచి వచ్చే చలిని తట్టుకోవడానికి వీలుగా శరీరంలో ఉష్టం ఉత్పత్తి కావాలి. మన దవడ కండరాలు శరీరంలోని మిగతా కండరాలు వణకడం ద్వారా ఉష్ణాన్ని ఉత్పత్తి చేయడానికి ప్రయత్నిస్తాయి. అలా పుట్టిన ఉష్ణం బయటి చలిని తట్టుకోడానికి ఉపకరిస్తుంది.  *మరీ చల్లటి నీళ్ళలో స్నానం చేస్తున్నప్పుడు కూడా మన కండరాలు ఇలాగే వణుకు తాయి గమనించండి.  *ఇదే విధంగా మలేరియా మూత్రనాళఇన్ఫెక్షన్ కి సంబందించిన జ్వరం లాంటి కొన్ని జ్వరాలాలో కూడా మన శరీరపు టెంప రేచర్ బాగా పెరిగిపోతూ ఉన్నప్పుడు ఇలా జరుగుతుంది.  *ఇక్కడ కారణం కూడా ఇదే.  *మన శరీరంలో వృద్ధి చెందుతున్న రోగ క్రిముల వ్యాప్తిని అరి కట్టడానికి శరీరానికి ఉష్ణం బాగా కావాల్సి ఉంటుంది. వనకటం ద్వారా మనం ఈ ఉష్ణాన్ని సంపాదించు కుంటాము.  
Publish Date: Jan 26, 2022 9:30AM