LIFE STYLE
తల దాచుకోవడానికి చిన్న గూడైన ఉండాలనుకుంటారు సగటు మనుషులు. అయితే ప్రపంచంలోనే కుబేరుల జాబితాలో చేరిన కొందరి ఇళ్లు చూస్తే ఇంద్ర భవనమా.. దేవంద్ర భవనమా.. మయుడి వాస్తు కళా నైపుణ్యామా అన్న ఆశ్చర్యం కలుగుతుంది. అలాంటి కొన్ని ఇళ్ల విశేషాలు చూద్దాం... అంటిలియా - ముఖేశ్ అంబానీ ప్రపంచంలోనే లక్షలాది ఇండ్ల మాదిరిగా అంటిలియా ను చూడలేం. వాటిలో ఒకటిగా లెక్కించలేం. ఎందుకంటే ఇది ప్రపంచంలోనే అతి ఖరీదైన గృహాల్లో రెండవది. దక్షిణ ముంబయిలో ఉండే ఈ ఇంటికి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ఇది భారతీయ బిలీయనీర్ ముఖేష్ అంబానీ, అతని కుటుంబ సభ్యుల రెడిడెన్సీ. ఆంటీలియాను డిజైన్ చేసింది చికాగో ఆర్కిటెక్ట్ పార్కిన్సన్ విల్. ఈ భవనాన్ని ఆస్ట్రేలియన్ కన్స్ట్రక్షన్ కంపెనీ లిమిటెడ్ హోల్డింగ్స్ నిర్మించారు. ఈ భవనంలో 27 అంతస్తులు ఉంటాయి. అనేక ఆధునిక హంగులతో దీన్ని రూపొందించారు. ఇందులో సెలూన్, న్యూ మూవీ థియేటర్ ఐస్ క్రీమ్ పార్లర్, స్విమ్మింగ్ ఫూల్, జిమ్ ,స్పా లాంటివి ఆధునిక సదుపాయాలు ఉన్నాయి. ఇంటి ఖరీదు రెండు బిలియన్ డాలర్లు. ప్రపంచంలోనే అతి ఖరీదైన గృహాల్లో రెండోవ స్థానం సాధించిన ఈ ఇల్లు భారతదేశంలో అతి ఖరీదైన మొదటి గృహం. జెకె హౌస్, గౌతమ్ సింఘానియా ఇప్పటి వరకు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఇంటి టైటిల్‌ను అంటిలియా సొంతం చేసుకుంది. ఇప్పుడు భారతదేశానికి చెందిన మరో బిలియనీర్ కుటుంబం సింఘానియా నివాసగృహం వెలుగులోకి వచ్చింది. j.k కంపెనీ అధినేత విలాసవంతమైన, ఆధునిక హంగులు ఉన్న ఇంటిని నిర్మించుకున్నారు. భారతీయ వ్యాపార సంస్థలలో అతి పెద్దదైన jk పరిశ్రమల పేరుతో నిర్మించిన ఈ ఇల్లు అంటీలియా తర్వాత అత్యంత ఖరీదైన గృహంగా రికార్డు సొంతం చేసుకుంది. 16,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ ఇంటిలో ఐదు ఫ్లోర్ల వరకు కార్ల పార్కింగ్ కోసమే వినియోగిస్తున్నారు. పట్టణంలో ఉన్న ఉత్తమ కార్లను పార్క్ చేయడానికి మాత్రమే ఐదు ఫ్లోర్ల స్థలం ఉపయోగిస్తున్నారంటే అర్థం చేసుకోవచ్చు.. ఈ ఇల్లు, ఇంటిలోని వారు ఎంత రిచో.. మిగతా అంతస్తుల్లో స్పా, స్విమింగ్ ఫూల్, జిమ్ వంటి వసతులతో పాటు ఎంటర్ టైన్ మెంట్ కోసం ప్రత్యేక స్థలం ఉంది. అంతేకాదు సొంత హెలిప్యాడ్ కూడా ఉన్నాయి. జెకే సంస్థకు గౌతమ్ సింఘానియా, చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్. ఈ సంస్థ రేమండ్ గ్రూప్ గా ప్రసిద్ధి చెందింది. ఆయనకు ఫాస్ట్ కార్లు, ఆధునిక పడవలు, లగ్జరీ రివేట్ జెట్లపై అమితమైన ఆసక్తి. ఆధునిక సదుపాయాలతో కూడిన ఈ ఖరీదైన భవనం విలువ సుమారు 6000 కోట్ల రూపాయలు ఈ ఖరీదైన గృహం అంటిలియా తరువాత భారతదేశంలో రెండవ ఎత్తైన ప్రైవేట్ భవనం. అడోబ్, అనిల్ అంబానీ ముంబైలోని పాలి హిల్ ప్రాంతంలో ఉన్న అనిల్ అంబానీ ఇల్లు భారతదేశంలో అత్యంత ఖరీదైన గృహాలలో ఒకటిగా చెప్పవచ్చు. ఈ ఎత్తైన భవనం ఫాన్సీ హెలిప్యాడ్ వంటి అత్యంత ఆధునిక సదుపాయాలతో నిర్మించారు. ఈ భవనం 16,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో , దాదాపు 70 మీటర్ల ఎత్తులో ఉంది. ఈ విలాసవంతమైన ఇంటి విలువ సుమారు 5000 కోట్ల రూపాయలకు పైగా ఉంది. అయితే ఈ విలాసవంతమైన భవనంలో నివసించే అనిల్ అంబానీ జీవనశైలి మాత్రం చాలా సింపుల్ గా ఉంటుంది. మన్నాట్, షారుఖ్ ఖాన్ ముంబయిలో ఉన్న మరో ఖరీదైన భవనం మన్నాట్. ఈ భవనం వార్తల్లోకి రావడానికి కారణం ఈ ఇంటి యజమాని ప్రముఖ బాలీవుడ్ నటుడు షారూఖ్ ఖాన్ కావడం. ఈ భవనం పై నుంచి అరేబియా సముద్రం అందాలను వీక్షించే సదుపాయం ఉంది. ఇది ముంబైలోని బాంద్రాలోని బ్యాండ్‌స్టాండ్ వద్ద ఉంది. గ్రామీణ ప్రాంతంలోని ఇంటి సగటు పరిమాణం 497 చదరపు అడుగులు, ఇది వ్యక్తికి 103 చదరపు అడుగులు. అయితే మన్నాట్ లో మాత్రం సుమారు 225 మంది నివసించవచ్చు. షారూఖ్ డ్రీమ్ హోమ్ అయిన ఈ భవనం ప్రపంచంలోని ఖరీదైన గృహాల జాబితాలో 10 వ స్థానంలో ఉంది. 13.32 కోట్లతో షారూఖ్ ఈ ఇంటిని సొంతం చేసుకున్నారు. ఇప్పుడు దాని విలువ 200 కోట్ల రూపాయలు. స్కై హౌస్, విజయ్ మాల్యా కింగ్ ఫిషర్ అధినేత విజయ్ మాల్యా పెంట్ హౌస్ ఖరీదైన గృహాల జాబితాలో చోటు సాధించింది. 40,000 చదరపు అడుగుల స్థలంలో తన డ్రీమ్ హౌస్ ను విజయ్ మాల్యా నిర్మించుకున్నారు. 35 అంతస్తుల ఎత్తైన భవనంపై నిర్మించిన పెంట్ హౌస్ ఇది. బెంగళూరు సిటీ నడిబొడ్డున ఉన్న ఈ భవనాన్ని కింగ్‌ఫిషర్ టవర్స్ - నివాసం అంటారు. ఎత్తైన టవర్ల పైభాగంలో నిర్మించిన ఆకాశ హర్మ్యం ఇది. దీన్ని మాల్యా వైట్ హౌస్, స్కై హౌస్ గా కూడా పిలుస్తారు. ఎత్తైన టవర్ల పై స్విమింగ్ ఫూల్, వైన్ సెల్లార్, సెలూన్ , స్పా, జిమ్ తో పాటు అనేక ఇతర విలాసవంతమైన సౌకర్యాలు ఇక్కడ ఉన్నాయి. హెలిప్యాడ్ కూడా తప్పనిసరిగా ఉంటుంది. వాస్తవానికి పెంట్ హౌస్ లా కనిపించినప్పటికీ ఇది ఒక పెంట్ హౌస్ కాదు, ఇది విల్లా కన్నా ఎక్కువ. స్కై హౌస్ విలువ గతంలో 135 కోట్ల రూపాయలు. ఇప్పుడు విలువ 150 కోట్ల రూపాయలు.
తేనెటీగలూ నేర్పుతాయి తియ్యటి పాఠాలు
తేనెటీగలు అనగానే శ్రమ గుర్తుకువస్తుంది. చిటికెడు తేనె కోసం వందలాది తేనెటీగలు పడే కష్టం గుర్తుకువస్తుంది. కానీ తేనెటీగలు అంతకు మించిన పాఠాలెన్నింటినో నేర్పుతాయంటున్నారు. జీవితానికి ఉపయోగపడే సూచనలు ఎన్నింటినో ఇస్తాయని చెబుతున్నారు. వాటిలో కొన్ని... కలిసికట్టుగా శ్రమ విభజన గురించి చెప్పుకోవాలంటే తేనెటీగల గురించే చెప్పుకోవాలి. తేనెపట్టుని నిర్మించడం దగ్గర నుంచీ, అందులో భద్రపరచిన తేనెని రక్షించుకోవడం వరకూ... ప్రతీ తేనెటీగా తనదైన బాధ్యతను నిర్వర్తిస్తుంది. ఇది ఎక్కువ పని, ఇది తక్కువ పని అని తేనెటీగలు చూసుకోవు. తాము ఉన్న జట్టుకి మేలు జరగడమే వాటి ఆశయంగా ఉంటుంది. పరిస్థితులకు అనుకూలంగా తేనెటీగల పని తేనెని సేకరించి భద్రపరచుకోవడమే కావచ్చు. అలాగని అవి కేవలం దట్టమైన అడవులలో మాత్రమే నివాసాన్ని ఏర్పరుచుకోవు. ఫలానా పూల దగ్గర తేనె ఎక్కువగా దొరుకుతుంది కదా అని అక్కడే తచ్చాడవు. ఏదో ఒక చోట తేనెపట్టుని ఏర్పరుచుకోవడం. అందులోకి తేనెని నింపేందుకు దూరదూరాల వరకూ తిరిగిరావడం... ఇదే వాటి పనిగా ఉంటుంది! ప్రకృతికి సాయం తేనెటీగలు తేనెని తీసుకోవడమే కాదు... అవి వాలిన పువ్వుల మీద ఉన్న పుప్పొడిని మరో మొక్క దగ్గరకు చేరవేస్తాయి. అలా పరాగసంపర్కానికి (pollination) దోహదపడతాయి. మనం తినే ఆహారంలో దాదాపు మూడో వంతు ఇలా pollination వల్లనే ఉత్పత్తి జరుగుతుందన్న విషయం మీకు తెలుసా! అలా తను ప్రకృతి మీద ఆధారపడుతూ, తిరిగి ఆ ప్రకృతికి ఎంతో కొంత ఉపకారం చేస్తూ జీవించేస్తుంటాయి తేనెటీగలు. జ్ఞానాన్ని సంపాదించడం తేనెటీగలు తేనె కోసం ఎంత దూరమైనా ప్రయాణిస్తాయి. ఓ రెండు చుక్కల కోసం ఎన్ని పూలనైనా చేరుకుంటాయి. జ్ఞానం కోసం తపించే వ్యక్తి కూడా జ్ఞానం ఉంటే అక్కడికి చేరుకోవాలని పెద్దలు సూచిస్తూ ఉంటారు. అలా కాకుండా అహంకారంతో మంకుపట్టు పట్టి నాలుగు గోడల మధ్యే ఉండిపోతే జీవితం నూతిలో కప్పలాగా నిరర్థకమైపోతుంది. ఆత్మరక్షణకు సాటిలేదు తేనెటీగలు వాటంతట అవి ఎవరి జోలికి వెళ్లి దాడి చేయవు. కానీ తేనెపట్టుని కదిపితే మాత్రం వాటిని ఎదుర్కోవడం మానవుడి తరం కూడా కాదు. మరీ తేనెటీగలలాగా వేటాడి వెంటాడి దాడి చేయనవసరం లేదు కానీ, అనవసరంగా తమ జోలికి రావద్దన్న హెచ్చరికను మాత్రం శత్రువులకు అందించాల్సి ఉంటుంది. - నిర్జర.
నిద్ర చాలకపోవటం వలన కోపం ఎక్కువగా వస్తుందా?
నిద్రే కదా ఏముందిలే అనుకుంటే పొరపాటే. చక్కటి ఆరోగ్యానికి ఆహారం ఎంత ముఖ్యమో నిద్ర కూడా అంతే ముఖ్యమట. నిద్రకు కోపానికి దగ్గరి సంబంధం ఉందట.. అదేంటో తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి. https://www.youtube.com/watch?v=aBxjhGIQdP4
ప్రతిభను పెంచే - Pygmalion effect
ఓ పిల్లవాడు తరగతిలో అందరికంటే వెనకబడిపోయి ఉంటాడు. ఒకో తరగతీ దాటే కొద్దీ అతను మొద్దుగా పేరు తెచ్చేసుకుంటాడు. ఇక అతన్ని బాగు చేయడం ఎవరి తరమూ కాదని అంతా నిశ్చయించుకుంటారు. ఇంతలో ఒక ఉపాధ్యాయుడి దృష్టి ఆ పిల్లవాడి మీద పడుతుంది. కాస్త ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటే ఆ పిల్లవాడు ఓ ఆణిముత్యంగా మారతాడన్న ఆశ ఉపాధ్యాయుడికి ఏర్పడుతుంది. అంతే! అక్కడి నుంచి ఆ పిల్లవాడి జీవితమే మారిపోతుంది. ఎందుకూ పనికిరానివాడు కాస్తా... అద్భుతమైన ఫలితాలు సాధించడం మొదలుపెడతాడు. వినడానికి ఇదంతా ఏదో సినిమాకథలాగా తోస్తోంది కదా! కానీ నిజజీవితంలో ఇది నూటికి నూరుపాళ్లూ సాధ్యమే అంటున్నారు. ఈ ప్రభావానికి ‘పిగ్మేలియన్ ఎఫెక్ట్’ అన్న పేరు కూడా పెట్టారు. పిగ్మేలియన్ ఒక గ్రీకు పురాణ పాత్ర పేరు. అతను ఓ గొప్ప శిల్పకారుడట. ఏ అమ్మాయి వంకా కన్నెత్తయినా చూడని, చూసినా ఆకర్షింపబడని ప్రవరాఖ్యుడట. అలాంటి పిగ్మేలియన్ ఓ అందమైన అమ్మాయి శిల్పాన్ని చెక్కుతాడు. తాను చెక్కిన శిల్పాన్ని చూసి తనే మనసు పారేసుకుంటాడు. చివరికి దేవుడి కరుణతో ఆ శిల్పానికి ప్రాణం వస్తుంది. అలా ప్రాణం వచ్చిన శిల్పాన్ని పిగ్మేలియన్ వివాహం చేసుకోవడంతో అతని కథ సుఖాంతం అవుతుంది. మన ఆశలకు అనుగుణంగా అనూహ్యమైన ఫలితాలను సాధించగలం అన్న ఆలోచనతో ‘పిగ్మేలియన్ ఎఫెక్ట్’ అన్న పేరు పెట్టారన్నమాట! రోసెంతాల్, జాకబ్సన్ అనే ఇద్దరు పరిశోధకులు 1968లో ‘పిగ్మేలియన్ ఎఫెక్ట్’ ప్రతిపాదన చేశారు. తమ ప్రతిపాదనని నిరూపించడం కోసం వారు ఓ ప్రయోగాన్ని చేపట్టారు. ఇందుకోసం వారు కాలిఫోర్నియాలోని ఓ పాఠశాలని ఎంచుకొన్నారు. ఆ పాఠశాలలో పిల్లలందరి ఐక్యూలని నమోదు చేశారు. ఆ తర్వాత వారి ఉపాధ్యాయుల దగ్గరకు వెళ్లి వారిలో కొందరు పిల్లలు ఐక్యూ చాలా అద్భుతంగా ఉందనీ... ఆ పిల్లలు ఎప్పటికైనా మంచి ఫలితాలు సాధిస్తారనీ చెప్పారు. నిజానికి వాళ్లు సేకరించిన వివరాలు వేరు, ఉపాధ్యాయులకు చెప్పిన వివరాలు వేరు. కానీ పరిశోధకులు చెప్పిన వివరాలను నమ్మిన ఉపాధ్యాయులు, తమ నమ్మకానికి అనుగుణంగానే ప్రవర్తించడం మొదలుపెట్టారు. తెలిసో, తెలియకో అద్భుతాలు సాధించగలరు అనే పిల్లల మీద ఎక్కువ దృష్టి పెట్టారు. కొంతకాలం గడిచిన తర్వాత ఉపాధ్యాయులు దృష్టి పెట్టిన పిల్లలు నిజంగానే మంచి ప్రతిభను కనబరిచారు. ఈ పిగ్మేలియన్ ఎఫెక్ట్ కేవలం బడిలోనే కాదు- ఆఫీసులో, ఇంట్లో, రాజకీయాల్లో... ఇలా మన జీవితంలోని ప్రతి సందర్భంలోనూ సత్ఫలితాలను సాధిస్తుందని చెబుతున్నారు. ఎదుటివ్యక్తి పనికిమాలినవాడు అన్న భావనతో ఉంటే, అతనితో మన ప్రవర్తన అలాగే ఉంటుంది. అలా కాకుండా అతనేదో సాధించగలడు అన్న నమ్మకంతో ఉంటే, అతని పట్ల మన ప్రవర్తించే తీరు మారిపోతుంది. మన ఆకాంక్షలు అతని మీద తప్పకుండా ప్రభావం చూపుతాయి. వాటిని అందిపుచ్చుకునేందుకు, అవతలివ్యక్తి కూడా ఓ నాలుగడుగులు ముందుకు వేసే ప్రయత్నం చేస్తాడు. పిగ్మేలియన్ ఎఫెక్ట్ ఇద్దరు వ్యక్తులకి మాత్రమే పరిమితం కాదు. ఒకోసారి మనమీద మనం నమ్మకాన్ని ఏర్పరుచుకున్నప్పుడు కూడా అనూహ్యమైన ఫలితాలను సాధించగలం. దీన్నే self-fulfilling prophecy అంటారు. పిగ్మేలియన్ ఎఫెక్ట్ ఏ మేరకు పనిచేస్తుంది? అది అనవసరమైన ఆకాంక్షలకు కారణం అవుతుందా! ఎదుటివ్యక్తి మీద మరింత ఒత్తిడిని కలిగిస్తుందేమో! లాంటి సందేహాలు లేకపోలేదు. అయితే జీవితంలో ఏమీ సాధించలేము అని నిరాశ చెందే సందర్భాలలోనూ, అవతలి వ్యక్తి ఎందుకూ పనికిరాడన్న అభిప్రాయానికి వచ్చేసినప్పుడూ ఈ పిగ్మేలియన్ ఎఫెక్ట్‌ని కాస్త పరీక్షిస్తే తప్పకుండా భిన్నమైన ఫలితం వచ్చి తీరుతుందంటున్నారు. - నిర్జర
HEALTH
మకో రోబోటిక్‌తో కీళ్ళమార్పిడి!
మకో రోబోటిక్ ఆర్మడ్ అసిస్టెడ్ సర్జరీతో కీళ్ళమార్పిడి సులభంగా లుధియానా వైద్యుల అవిష్క రణ. కీళ్ళమార్పిడి మకో రోబోటిక్ ఆర్మ్ అసిస్టేడ్ టెక్నాలజీతో సర్జరీ పద్దతిని లుధియానాలోని హ్యుజన్ ఆసుపత్రి అదునతన విధానాన్ని కనుకున్నది . రోబోట్ ఆర్మ్ ఆసిస్టేడ్ విధానంలో సర్జన్లు లేకుండానే కీళ్ళమార్పిడి శాస్త్ర చికిత్స చేయవచ్చని ఈ విధానంలో ఊహించినదానికన్నా ఎక్కువ సమయంలోనే సమర్దవంతంగా సర్జరీలు నిర్వహించినట్లు లుదియానకు చెందిన వైద్యులు విజయం సాధించారు. మాకో రోబోటిక్ ఆర్మ్ ఆసిస్ స్టెద్ విధానంతో లుధియానా ఆసుపత్రి వైద్యరంగంలో మైలురాయిని అధిగమించినట్లయ్యింది. కీళ్ళమార్పిడి పద్దతిలో అదునాతాన సాంకేతికతను వినియోగించిన ఉత్తరాదిలో మొట్టమొదటి ఆసుపత్రిగా పేరుగాంచింది. మాకో రోబో టిక్ ఆర్మ్ అసిస్టేడ్ విధానాన్ని ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఎఫ్ డి ఎ సైతం అనుమతించింది. స్ట్రైకర్ ఇండియా హ్యుంజన్ ఆసుపత్రి సంయుక్తంగా విడుదల చేసిన ఒక పత్రిక ప్రకటనలో ఈ విషయం వెల్లడించారు. శాస్త్రీయ సంప్రదాయ సర్జరీలకన్న భిన్నంగా ఉందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. కీళ్ళ నొప్పులు , కీలు అరిగిపోయిన వారికీ చేసే కీళ్ళ మార్పిడికి మాకో రోబో ఆర్మ్ ఆసిస్టెడ్ సర్జరీ ఒకరకమని స్ట్రైకర్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ మీనాక్షి నేవతియా అన్నారు. భవిష్యత్తులో హ్యుజన్ ఆసుపత్రితో కలిసి మరిన్నికొత్త పద్దతులు అమలు చేస్తామని ఆమె చెప్పారు. రోగులకు మెరుగైన సేవలు అందించడానికి కృషి చేస్తామని మీనాక్షి పేర్కొన్నారు. రోగుల అవసరాలను తీర్చగలిగినందుకు ఆనందంగా ఉందని ఆమె హార్షం వ్యక్తం చేసారు. లుదియానాకు చెందిన హ్యుజన్ ఆసుపత్రి డైరెక్టర్ నీరీప్లేస్మేంట్ సర్జన్ డాక్టర్ బి ఎస్ హ్యుజన్ మాట్లాడుతూ సంప్రదాయ శస్త్ర చికిత్స లకు ఒక సవాల్ వంటిదని ఆయన అన్నారు. ఇందులో సర్జన్ ప్రతిభ ఆధారపది ఉంటుందని అన్నారు. పాత పద్దతిలో బోన్స్ ను ప్రతిసారీ కోయాల్సి వచ్చేదని కొత్తగా వచ్చిన రోబోటిక్ సర్జరీ ప్రోత్సాహాన్ని ఇచ్చిందని అన్నారు. ఎనిమిది మంది పైజరిపిన శస్త్ర చికిత్స మంచి ఫలితాలు ఇచ్చిందని అన్నారు. సర్జరీకి ముందుగానే ఆ పేషంట్ల గురించి అవగాహన ఉండడం వల్ల తక్కువ కోతలు ఉండవచ్చని సాఫ్ట్ టి ష్యు డేమేజ్ కాకుండా నివారించవచ్చని ఎముకను కాపాడవచ్చని హ్యుజన్ వివరించారు. హ్యుజన్ ఆసుపత్రి ఆర్తో కన్సల్టెంట్ జైవీర్ హ్యుజాన్ మాట్లాడుతూ అధునాతన రోబోటిక్ ఆర్మ్ అసిస్టెడ్ టెక్నాలజీతో రోగుల జీవన ప్రమాణాలు పెంచవచ్చని అభిప్రాయపడ్డారు. ఈ పద్దతిలో రోగులకు మరిన్ని లాభాలున్నాయని అన్నారు. అంతార్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఈ విధానం అమలు చేస్తామని జైవీర్ తెలిపారు. ఒక్కోక్కరిలో బోన్స్ అనాటమీ వేరువేరుగా ఉంటుందని కీళ్ళ మార్పిడి లేదా హిప్ సర్జరీ చేయడంలో మాకో రోబోటిక్ సర్జరీలో త్రీ డి మోడల్ గుర్తించేందుకు సి డి స్కాన్ ఆధారంగా వర్చువల్ సర్గికల్ ప్రొసీజర్ అమలుచేస్తామని జైవీర్ తెలిపారు. ఇందుకోసం 1౦౦౦ మాకో సిస్టంలో 35,౦౦౦ పద్దతులు ఇప్పటిక్ పరిశీలించమని మాకో రోబోటిక్ ఆర్మ్ ఆసిస్టెడ్ సాంకేతికత క్లినికల్ గా నిరూపించామన్నారు.
హైపర్ టెన్షన్ ను మ్యానేజ్ చేసే క్యారెట్..!
కూరగాయలలో అందరూ ఇష్టపడి అన్నిటిలోనూ వాడుకునే తియ్యటి క్యారెట్ లో ఉన్నన్ని గుణాలు మరే కూరగాయలలోను కనిపించవు అంటే అతిశయోక్తి కాదు. మన దైనందిన ఆహారపు అలవాట్లలలో క్యారెట్ ను బాగా ఉపయోగించుకుంటే ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. క్యారెట్ వాడకం ఆరోగ్యపరంగా ఎంతో మేలు చేస్తుందని ఇందులోని అధిక క్యాలరీలు పిల్లలు శారీరకంగా, మానసికంగా ఎదిగేలా చేయడమే కాక మేధో వికాసానికి ఎంతో ఉపయోగ పడుతుందని వైద్యులు చెబుతారు. ఈ క్యారెట్‌లోనున్న గుణాలు మరెందులోను ఉండవంటున్నారు వైద్యులు. సాధారణంగా క్యారెట్‌తో చేసిన వంటకాలను తినేందుకు ఎక్కువ శాతంమంది ఇష్టపడరు. మరి కొంతమంది క్యారెట్‌ను పచ్చి గా తినేందుకు ఇష్టపడతారే కానీ, వండితే మాత్రం ఇష్టపడరు. క్యారెట్లు ఆరోగ్యపరంగా ఎంతో మేలును కల్గిస్తాయనీ, ఇందులోని అధిక క్యాలరీలు పిల్లలు శారీరకంగా, మానసికంగా ఎదిగేలా చేయడమే కాక మేధో వికాసానికి ఎంతో తోడ్పడతాయని వైద్యులు చెబుతున్నారు. వండితే తినేందుకు ఇష్టపడని ఈ క్యారెట్లను సలాడ్ల రూపంలోనూ, జ్యూస్‌ల రూపంలోనూ తీసుకోవచ్చుననీ, ఇలా తీసుకున్నట్లయితే మంచి పోషకవిలువలు, ఆరోగ్యం లభిస్తుందని వైద్యులు పేర్కొంటున్నారు. క్యారెట్ వినియోగం వల్ల హైపర్ టెన్షన్ ను మ్యానేజ్ చేయవచ్చు. క్యారెట్స్ లో క్యాల్షియం పుష్కలంగా ఉండటం వల్ల ఇది ఎముకల ఆరోగ్యానికి బాగా సహాయపడుతుంది. అదే కాకుండా ఇన్సులిన్ రెసిస్టెన్స్ కు సహాయపడుతూ బ్లడ్ గ్లూకోజ్ లెవల్స్ ను మెయింటైన్ చేయడానికి క్యారెట్ సహాయపడుతుంది. మన శరీరంలోని రోగ నిరోధక శక్తిని కాపాడటంలో ప్రముఖ పాత్ర వహించే ఈ క్యారెట్ ను ఎంత ఎక్కువగా ఉపయోగిస్తే మనం మన అనారోగ్య సమస్యల నుండి అంత త్వరగా బయట పడవచ్చు..
సమతౌల్యమైన ఆహారం తీసుకుంటేనే ఆరోగ్యం
శాఖాహరం తీసుకుంటేనే మనిషి కొన్నాళ్ళు అయినా భూమిపై మనుగడ అని ప్రముఖ శాస్త్రజ్ఞుడు ఆల్ల్బెర్ట్ ఐన్‌స్టైన్ అన్నారు. అలా ఉండాలంటే మనం ఎలాంటి ఆహారం తీసుకోవాలో చూద్దాం. సహజంగా కాయగూరలు, పళ్ళు, చిక్కుళ్ళు, బంగాళా దుంపలు, తృణ ధాన్యాలు, చిరు ధాన్యాలు, మూలికలు మసాలాలు, నెయ్యి, మజ్జిగ, రిఫైండ్ చేయని నూనెలు తీసుకోవాలి. కూరాగాయాలలో: తాజా కూరగాయాలు, ఆకూ కూరలు, తదితరాలు. పళ్ళలో: నారింజ,అనాస పండు, ద్రాక్ష పళ్ళు, డేట్స్, అత్తి పండ్లు, పుచ్చ కాయ. చిక్కుళ్ళు: బీన్స్, పచ్చి బటానీ, కాయ ధాన్యాలు, పప్పు ధాన్యాలు, కోడి గుడ్లు తదితరాలు. దుంపలు: బీట్ రూట్, క్యారెట్, బంగాళదుంపలు, కలోకాసియా తదితరాలు. తృణ ధాన్యాలు: మిల్లెట్స్, ఫొక్ష్ టైల్ మిల్లెట్, ఫింగర్ మిల్లెట్, బర్న్ యార్డ్ మిల్లెట్, రెడ్ రైస్, బ్రౌన్ రైస్ తదితర ధాన్యాలు. పాల పదార్ధాలు: నెయ్యి, ఆవు పాలు, పెరుగు, మజ్జిగ. మూలికలు, సుగంధ ద్రవ్యాలు: తులసి, పుదీనా, పసుపు, జీల కర్ర, జాజి కాయ, జాపత్రి, దాల్చిన చెక్క, నల్ల మిరియాలు, వెల్లుల్లి తదితరాలు. కొవ్వు పదార్ధాలు: రీఫైండ్ చెయ్యని నూనెలు, నువ్వుల నూనె, పొద్దు తిరుగుడు పువ్వుల నూనె, కొబ్బరి నూనె, ఆవ నూనె తదితరాలు. మన రోటీన్ జీవితంలో సరైన సమయంలో సమతౌల్యమైన ఆహారం తీసుకుంటేనే ఆరోగ్యంగా ఉంటారు.
దేశంలో కరోనా డేంజర్ బెల్స్ ! రాష్ట్రాలకు కేంద్రం గైడ్ లైన్స్
కోవిడ్ వైరంట్ N44OK తన ఉగ్రరూపాన్ని చూపిస్తోంది ఇప్పటికే పంజాబ్, మహారాష్ట్ర, కేరళ, ఛత్తీస్ ఘడ్, మధ్య ప్రదేశ్, జమ్మూ కశ్మీర్ రాష్ట్రాలలో రోజురోజుకు సెకండ్ వేవ్ చూపిస్తుందని అనుమానం కలుగు తోంది. అయితే రెండవ దశ కోవిడ్ కు N44OK సిసిఎంబి శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనలో N44OK వైరస్ వేరియంట్ గా గుర్తించారు. కోవిడ్ వైరంట్ 1 9 దక్షిణాదిలో శర వేగంగా విస్తరిస్తోందని సిసిఎంబి డైరెక్టర్ రాకేశ్ మిశ్రా వెల్లడించారు. వైరంట్ రూపాంతరం చెందుతోందని దీనిని పూర్తిగా అధ్యయనం చేయడానికి క్షుణ్ణంగా గమనించాలని శాస్త్రజ్ఞులకు సూచించారు. దీని ప్రభాల్యం తక్కువ సమయంలో ఎక్కువ ప్రభావం చూపిస్తుందని రాకేశ్ తెలిపారు. కోవిడ్ 1 9 రెండవ దశ తన ఉగ్రరూపాన్ని చూపిస్తోంది అని కేంద్ర నివేదికలు చెపుతున్నాయి. పంజాబ్, మహారాష్ట్ర, మధ్య ప్రదేశ్ , కేరళ, చతీస్ ఘడ్, జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రరూపం చూపుతోందని కేంద్ర కుటుంబ సంక్షేమం ఆరోగ్య శాఖ ఒక నివేదికలో వెల్లడించింది. 17 రోజుల తరువాత దేశంలో మరోసారి యాక్టివ్ కేసుల సంఖ్య లక్షన్నరను దాటింది. నవంబర్ నెలలో 24వ తేదీన 4,38,667 యాక్టివ్ కేసులు ఉండగా, ఆ సంఖ్య మూడు రోజుల్లో 3.85 శాతం పెరిగి 4.55 లక్షలను దాటాయి. సోమవారం మళ్లీ కేసులు పెరిగిపోయాయి. వరుసగా ఐదవ రోజు కూడా యాక్టివ్ కేసుల సంఖ్య పెరిగింది. గత వారంలో 1.5 శాతం ఉన్న ఈ పెరుగుదల, ఇప్పుడు 2.9 శాతాన్ని దాటింది. ఇక రోజువారీ కొత్త కేసుల సంఖ్య విషయంలోనూ గణాంకాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ నెల 16న 9,121గా ఉన్న రోజువారీ కొత్త కేసుల సంఖ్య, ఏడు రోజుల సగటును దాటి 13.8 శాతం పెరిగి సోమవారం నాడు 14,199కి పెరిగాయి. మహారాష్ట్ర, కేరళ, ఛత్తీస్ గఢ్, మధ్యప్రదేశ్ లలో రోజువారీ కొత్త కేసుల సంఖ్య పెరుగుతోంది. ఈ ఐదు రాష్ట్రాల్లోనూ ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాలని కేంద్రం ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. కొత్త కేసుల్లో న్యూ స్ట్రెయిన్ అధికంగా కనిపిస్తుండటంతో, దాని వ్యాప్తి గొలుసును విడగొట్టేందుకు వైద్యాధికారులు, స్థానిక అధికారులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ప్రస్తుతం దేశంలో ఉన్న మొత్తం యాక్టివ్ కేసుల్లో 74 శాతం కేసులు కేరళ, మహారాష్ట్రలోనే ఉండటం ఆందోళన కల్గిస్తోంది. దేశంలో కరోనా కేసులు పెరుగుతుండటంతో కేంద్ర ఆరోగ్య శాఖ అన్ని రాష్ట్రాలకు తాజాగా ఆదేశాలు జారీ చేసింది.. 1) ఆర్టీపిసిఆర్ పరీక్షల సంఖ్య పెంచాలి. 2) నెగెటివ్ ర్యాపిడ్ అంటిజన్ పరీక్షలు తప్పని సరిగా చేయాలి 3) ఆర్టీపీసీఆర్ ద్వారా నెగెటివ్ వ్యక్తులు మిస్ కారాదు 4) ఎంపిక చేసిన జిల్లాలలో కన్ టైన్ మెంట్ జోన్లు ఏర్పాటు 5) జీనోమ్ సీక్వెన్స్ ప్రకారం క్లస్టర్ల నిర్వహణ అయితే గతం కంటే ఇప్పుడు అపార్ట్ మెంట్లులలో కోవిడ్ విస్తరిస్తోందని అవసరమైతే ఆ అపార్ట్ మెంట్ ను సైతం సీజ్ చేసేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది.
TECHNOLOGY
కండ్ల ముందే ప్రపంచం.. కళ్లజోడు లోనే సమస్తం
సాంకేతిక రంగంలో మరో విప్లవానికి రిలయన్స్ సంస్థ తెరతీసింది. జియో ఇంటర్నెట్ తో లక్షలాది మంది వినియోగదారులను తన ఖాతాలో జమచేసుకున్న ఈ సంస్థ తాజాగా మార్కెట్లోకి విడుదల చేసిన జియో గ్లాసెస్ డిజిటల్ ప్రపంచాన్ని కొత్త కోణంలో చూపించబోతున్నాయి. రిలయన్స్ సంస్థ 43న వార్షికోత్సవంలో జియో గ్లాస్ ను ఆవిష్కరించారు. ఈ కళ్లజోడుతో ఇప్పటివరకు అరచేతిలో ఇమిడిన ప్రపంచం ఇంక కంటి ముందు సాక్షాత్కరించబోతుంది. కరోనా వ్యాప్తి కారణంగా ప్రపంచమంతా డిజిటలైజ్ అయ్యిన తరుణంలో ఆన్ లైన్ క్లాస్ లు, వీడియా కాన్ఫరెన్సులు, జూమ్ మీటింగ్ లు సగటు మనిషి జీవితంలో సాధారణమైన తరుణంలో ఈ జియో గ్లాస్ లు ఎంతో ఉపయోగకరంగా ఉండ బోతున్నాయి. అయితే వీటి ధరను మాత్రం ఇంకా ప్రకటించలేదు. జియో గ్లాస్ ఫీచర్స్ - నల్లని రంగు..కాస్త మందంగా.. కూలింగ్ గ్లాసెస్ లను పోలిన వీటి బరువు కేవలం 75 గ్రాములు మాత్రమే. - ఈ గ్లాసెస్ ద్వారా మన స్మార్ట్ ఫోన్ నుంచి 25 మిక్సిడ్ రియాలిటీ యాప్స్ పనిచేసేలా సెట్టింగ్ చేసుకోవచ్చు. - ప్రత్యేకంగా పొందుపరిచిన 3 డి హోలో గ్రాఫిక్ డిజైన్ ద్వారా వర్చువల్ రియాల్జీలో మీటింగ్స్ నిర్వహించుకోవచ్చు. - ఇందులో అమర్చిన సెన్సార్లు, హార్డ్ వేర్ అధునాతన టెక్నాలజీలో పనిచేస్తాయి. ఎక్స్ ఆర్ సౌండ్ సిస్టం ద్వారా ఎలాంటి కేబుల్ అటాచ్ మెంట్ లేకుండా మీకు ఇష్టమైన మ్యూజిక్ వినవచ్చు. ఆన్ లైన్ క్లాస్ లు వినవచ్చు. అన్ని రకాల ఆడియో ఫార్మెట్లను సపోర్ట్ చేసే టెక్నాలజీ ఇందులో ఉంది. - హై రిజల్యూషన్ లో ఉండే డిస్ ప్లే ద్వారా గేమింగ్, షాపింగ్ ఎంజాయ్ చేయవచ్చు. - ఇందులోని హోలా గ్రాఫిక్ వీడియో కాల్ ద్వారా పెద్ద స్క్రీన్ పై ప్రజెంటేషన్లు ఇవ్వచ్చు. - అంతేకాదు 3డీ వర్చువల్ అవతార్, 2డి వర్చువల్ ఇంటరాక్షన్ ద్వారా కూడా మీకు కావల్సిన విధంగా ఈ కళ్లజోడు పనిచేస్తుంది. - జియో మిక్స్ డ్ రియాలిటీ క్లౌడ్ అందుబాటులో ఉండటంతో ఆన్ లైన్ క్లాస్ లు నిర్వహించేవారికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. - ప్రపంచాన్నిసుందరంగా చూపించగల టెక్నాలజీని ఈ కళ్లజోడుతో అందిస్తున్నారు. విద్యార్థులు, ఉద్యోగులు, గృహిణులు, వ్యాపార వేత్తలు ఇలా అన్నిరంగాల వారికి ఉపయోగపడేలా ప్రపంచాన్ని అరచేతిలో నుంచి కండ్లముందుకు తీసుకువస్తున్నారు.
YouTube Premium and Music services launched in India, starts at Rs 99 per month
Just over a week after the launch of the Spotify in India, there is a new streaming service in town. YouTube has launched YouTube Premium, YouTube Originals and YouTube Music in India — the services were launched globally last June. YouTube Music (ad-supported), YouTube Music Premium (ad-free), YouTube Premium (ad-free) have been launched in India. According to YouTube, YouTube Music will be available both as a standalone mobile app and a Web-based desktop interface that is designed for music streaming. The service offers original songs, albums, thousands of playlists, and artist radio as well as YouTube's own catalog of remixes, live performances, covers, and music videos. YouTube has also brought its premium service with original content to India. Earlier called YouTube Red, this service offers ad-free playback and access to YouTube’s cache or original shows and movies. At the moment there is a mix of shows, but nothing big enough to drive someone to take a subscription. We will have to wait and see if YouTube will put its money behind Indian shows. subscription plan offers: YouTube Music Premium is priced Rs 99 a month. YouTube Premium will be available for 129 a month and will include membership to YouTube Music Premium. The subscription will offer an ad-free experience with background play and offline downloads for millions of videos on YouTube, as well as access to all YouTube Originals. Those buying the new Samsung Galaxy S10 series will also get four months of free access to YouTube Premium and YouTube Music Premium.
Your WhatsApp account will be deactivated if you use these apps
WhatsApp on its official has warned people of account ban if they use altered versions of WhatsApp like GBWhatsApp and WhatsApp Plus. WhatsApp suggests to immediately download the original app to continue using the service.The Facebook-owned WhatsApp on its official has warned people of account ban if they use altered versions of WhatsApp like GBWhatsApp and WhatsApp Plus. These are unsupported versions of WhatsApp and using these apps can lead to the temporary ban of the account.WhatsApp cares deeply about the safety of our users. To protect the privacy and security of their account, we strongly recommend users only download WhatsApp from official app stores or from our website. People using GBWhatsApp and WhatsApp will see an in-app message saying your account is temporarily banned. The chat app suggests to immediately download the original app to continue using the service. WhatsApp doesn't support these third-party apps because we can't validate their security practices," the company states on its FAQ page. Before switching to the original app, WhatsApp recommends you to back up their chat history. Those using GBWhatsApp and WhatsApp Plus can follow these steps to save their chat history. 1)Open GB WhatsApp and tap More options > Chats > Back up chats. 2)Go to Phone Settings > tap Storage > Files. 3)Find the folder GB WhatsApp and tap and hold to select it. 4)In the upper right corner tap More > Rename and rename the folder to "WhatsApp." 5)Go to the Play Store and download and install the official WhatsApp app. 6)On the Backup found screen, tap Restore > Next. WhatsApp should load with your existing chats.
Best phones under 20,000 in 2019