Top Stories

తెలుగు రాష్ట్రాల్లో భారత్‌ బంద్.. స‌క‌లం క్లోజ్‌..

ఏపీ, తెలంగాణ‌లో భార‌త్‌బంద్ విజ‌య‌వంత‌మైంది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా సంయుక్త కిసాన్‌ మోర్చా పిలుపుతో దేశవ్యాప్తంగా భారత్‌ బంద్ కొన‌సాగింది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ రాజకీయ పక్షాలు, ప్రజా సంఘాలు బంద్‌కు మ‌ద్ద‌తు ఇవ్వ‌డంతో బంద్ ప్ర‌శాంతంగా జ‌రిగింది. వివిధ పార్టీల నాయ‌కులు బంద్‌ను ప‌ర్య‌వేక్షించారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతికేరంగా నినాదాల చేస్తూ ర్యాలీలు నిర్వహించాయి. స్వచ్ఛందంగా షాపులు, స్కూళ్లు మూసేశారు. ఏపీలో మధ్యాహ్నం వరకు బస్సు సర్వీసులను ప్ర‌భుత్వ‌మే నిలిపివేయ‌డంతో ప్ర‌జ‌లు ఇబ్బందిప‌డ్డారు.  భార‌త్‌బంద్ సంద‌ర్భంగా బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో బస్టాండ్స్‌ ద‌గ్గ‌ర‌ నిరసన తెలిపారు. ఆందోళకారులు వాహనాలను ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. తిరుపతిలో బంద్‌ కొద్దిపాటి ఉద్రిక్తతకు దారి తీసింది. వామపక్షాలు, కార్మిక సంఘాల నాయకులు రైల్వేస్టేషన్‌లోకి వెళ్లేందుకు  ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. అమరావతిలో వర్షం పడుతున్నా సీపీఐ, సీపీఎం నాయకులు బంద్‌లో పాల్గొన్నారు.   తెలంగాణలోని పలు బస్సు డిపోల ముందు వామపక్షాలు ఆందోళనకు దిగాయి. హైదరాబాద్‌లో బంద్‌ పాక్షికంగా కొనసాగింది. ఉప్పల్‌, కూకట్‌పల్లి డిపోల ముందు పలువురు నాయకులు ఆందోళన చేపట్టారు. నల్గొండలో వామపక్షాలు ధర్నా చేపట్టాయి. ఏపీ, తెలంగాణ‌లోని ప‌లు ప్రాంతాల్లో ఉద‌యం నుంచి వ‌ర్షం ప‌డ‌టంతో.. ఇటు వ‌ర్షం, అటు బంద్ ప్ర‌భావం స్ప‌ష్టంగా క‌నిపించింది. ప్ర‌జ‌లు ఇంటికే ప‌రిమిత‌మ‌య్యారు. 
Publish Date:Sep 27, 2021

జ‌గ‌న్ జాబితాలో కొత్త మంత్రులు వీళ్లే..! జిల్లాల వారీగా పేర్లు ఇవే..!

ఏపీ కేబినెట్ మొత్తం మారి పోతోంది. మంత్రివ‌ర్గాన్ని పూర్తిస్థాయిలో ప్ర‌క్షాళ‌న చేయ‌నున్నారు సీఎం జ‌గ‌న్‌. సీనియ‌ర్లు, జూనియ‌ర్లు అనే తేడా లేకుండా అంద‌రినీ కేబినెట్ నుంచి తొల‌గించ‌నున్నారు. ప‌లువురు మంత్రుల ప‌నితీరు ఏమాత్రం బాగా లేక‌పోవ‌డం, మిగ‌తా వారికీ అవ‌కాశం ఇవ్వాల‌నే  ఉద్దేశ్యం, రెండున్న‌రేళ్ల త‌ర్వాత మంత్రిమండ‌లిని మారుస్తాన‌నే ప్ర‌క‌ట‌న‌.. ఇలా అన్నీ క‌లిసి కేబినెట్ మార్పుకు జ‌గ‌న్ క‌స‌ర‌త్తు పూర్తి చేశార‌ని తెలుస్తోంది. జ‌గ‌న్ ఆదేశాల మేర‌కే మంత్రి బాలినేని ఇప్ప‌టికే ఆ మేర‌కు లీకులు ఇచ్చార‌ట‌. మ‌రోవైపు జిల్లాల వారీగా జాబితా సిద్ధ‌మై పోయింద‌ని చెబుతున్నారు. కేబినెట్ కూర్పుతో 2024 ఎల‌క్ష‌న్ టీమ్‌ను రెడీ చేస్తున్నారు. ఇంటలిజెన్స్ వ‌ర్గాల నుంచి స‌మాచారం సేక‌రించిన సీఎం.. కేబినెట్ కూర్పుపై క్లారిటీకి వ‌చ్చేశార‌ని అంటున్నారు. అన్నీ కుదిరితే.. ఈ ద‌స‌రాకే కొత్త‌ మంత్రిమండ‌లి కొలువుదీర‌డం ఖాయ‌మంటున్నారు.  ఎప్ప‌టిలానే ప్రాంతీయ, సామాజిక సమీకరణాలే కీలకం కానున్నాయి. జిల్లాల వారీగా ఆశావ‌హుల పేర్లపై లీకులు వ‌స్తున్నాయి. శ్రీకాకుళం జిల్లా నుంచి ఒక్క లాస్ట్ ఛాన్స్ కోసం ఎదురుచూస్తున్న ప్రస్తుత స్పీకర్‌ తమ్మినేని సీతారాంకు ఈసారి మంత్రి పదవి ఖాయ‌మంటున్నారు. ధర్మాన క్రిష్ణదాస్ స్థానంలో ఆయ‌న సోదరుడు ధర్మాన ప్రసాదరావుకు అవ‌కాశం ద‌క్కుతుంద‌ని భావిస్తున్నారు.  విజయనగరం జిల్లాలో కొత్తగా కోలగట్ల వీరభద్రస్వామి, పీడిక రాజన్నదొర రేసులో ఉన్నారు. ఎస్టీ మహిళకు అవకాశం ఇవ్వాలని భావిస్తే రాజన్న దొరకు ఛాన్స్ కష్టమే అంటున్నారు.             విశాఖ జిల్లాలో కాంపిటీష‌న్ ట‌ఫ్‌గా ఉంది. గుడివాడ అమర్‌నాథ్‌, కరణం ధర్మశ్రీ, పెట్ల ఉమా శంకరగణేష్‌ మంత్రి పదవి ఆశిస్తున్నారు. ముత్యాల నాయుడు పేరు కూడా వినిపిస్తోంది. వీరిలో అమ‌ర్‌నాథ్‌కు ఛాన్సెస్ ఎక్కువ‌గా ఉన్నాయంటున్నారు. ఇక‌, గిరిజన కోటాలో ఫాల్గుణ, కె.భాగ్యలక్ష్మి కూడా మంత్రి పదవిని కోరుకుంటున్నారు.  తూర్పు గోదావరి జిల్లాలో ఇప్పుడున్న ముగ్గురు స్థానంలో కొత్తగా మ‌రో ముగ్గురిని తీసుకుంటార‌ని తెలుస్తోంది. యనమల సోదరుడిని రెండు సార్లు ఓడించటంతో పాటుగా తొలి నుంచి జగన్ విధేయుడిగా ఉన్న‌ దాడిశెట్టి రాజా రేసులో ముందున్నారు. కన్నబాబు స్థానం ఆయనతో భర్తీ చేసే అవకాశం ఉంది. ముమ్మడివరం ఎమ్మెల్యే సతీష్‌తో పాటు గిరిజన కోటాలో నాగులాపల్లి ధనలక్ష్మి పోటీలో ఉన్నారు.         రాజకీయంగా ప‌శ్చిమ‌ గోదావరి జిల్లా కీలకం కావటంతో ఈ జిల్లా నుంచి ఎస్సీ-క్షత్రియ-కాపు వర్గానికి అవకాశం దక్కనుంది. క్షత్రియ కోటాలో ముదునూరి ప్రసాద రాజు, కాపు వర్గం నుంచి కొట్టు సత్యానారాయణ లేదా గ్రంధి శ్రీనివాస్ పేర్లు వినిపిస్తున్నాయి. ఎస్సీ వర్గం నుంచి తలారి లేదా ఓ ఎమ్మెల్సీకి అవకాశం దక్కే ఛాన్స్ ఉంది. పశ్చిమ గోదావరి జిల్లా నుంచి క‌మ్మ కోటాలో అబ్బయ్య చౌదరి పేరు కూడా వినిపిస్తున్నా అవ‌కాశం త‌క్కువే అంటున్నారు. ఇక‌, సీనియర్ల కోటాలో కృష్ణాజిల్లాలో కొలుసు పార్థసారధికి మంత్రి ప‌ద‌వి ఖాయమ‌ని తెలుస్తోంది. క్రిష్ణా జిల్లా నుంచి సామినేని ఉదయభాను, మల్లాది విష్ణు, జోగి రమేష్‌, మేకా వెంకట ప్రతాప అప్పారావులు మంత్రి పదవి రేసులో ఉన్నారు. వీరిలో ఇటీవ‌ల బాగా యాక్ష‌న్ చేసిన జ‌గ‌న్ అభిమానం చూర‌గొన్న జోగి ర‌మేశ్‌కు మినిస్ట‌ర్ పోస్ట్ ప‌క్కా అని అంచ‌నా వేస్తున్నారు. కమ్మ వర్గానికి ప్రాధాన్యత ఇవ్వాలని భావిస్తే గుంటూరు జిల్లా నుంచి మర్రి రాజశేఖర్ మంత్రి పదవి ద‌క్క‌వ‌చ్చు. మంగళగిరి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి ఈసారి మంత్రి ప‌ద‌వి ఆశిస్తున్నారు. డిప్యూటీ స్పీకర్‌ కోన రఘుపతి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, విడదల రజని, ముస్లిం మైనార్టీ నుండి మహ్మద్‌ ముస్తఫా.. ఇలా ఈ జిల్లా నుంచి చాలామందే రేసులో ఉన్నారు. ఇక‌, కాపు కోటాలో అంబటి రాంబాబుకు మంత్రిప‌ద‌వి ఖాయమే అంటున్నారు.  ప్రకాశం జిల్లా నుంచి మహీధర్‌రెడ్డి, అన్నా రాంబాబుల పేర్లు వినిపిస్తున్నాయి.  నెల్లూరు జిల్లా నుంచి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్‌ రెడ్డికి కేబినెట్ బెర్త్ ద‌క్కే ఛాన్సెస్ ఎక్కువే. ఆనం రామ నారాయణరెడ్డి, ఎస్‌సి కోటాలో కిలివేటి సంజీవయ్య రేసులో ఉన్నారు.  చిత్తూరు జిల్లా నుంచి చిర‌కాలంగా మంత్రి ప‌ద‌వి ఆశిస్తున్న‌ రోజా పేరు ప్ర‌ముఖంగా వినిపిస్తున్నా.. పెద్దిరెడ్డిని కాద‌ని రోజాను కేబినెట్‌లో చేర్చుకునే సాహ‌సం జ‌గ‌న్ చేస్తారా?  లేదా? అనేది ఆస‌క్తిక‌రం. అయితే, గ‌త కేబినెట్‌లోనే రోజాకు మంత్రి ప‌ద‌వి వ‌స్తుంద‌ని ప్ర‌చారం జ‌రిగినా అది కుద‌ర‌క‌పోవ‌డంతో కొన్ని రోజులు అల‌క‌మూని అజ్ఞాతంలోకి వెళ్లిపోయింది రోజ‌మ్మ‌. అప్పుడు నెక్ట్స్ టైమ్ త‌ప్ప‌కుండా మంత్రిని చేస్తానంటూ రోజాకు జ‌గ‌న్ హామీ ఇచ్చార‌ని అన్నారు. ఆ హామీని ఇప్పుడు నెర‌వేర్చుకునే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు. రోజాతో పాటు చెవిరెడ్డి భాస్కరరెడ్డి సైతం కేబినెట్ రేసులో ఉన్నారు.  కడప నుండి కొరుముట్ల శ్రీనివాసులు, శ్రీకాంత్ రెడ్డి, సి.రామచంద్రయ్యలు మంత్రి ప‌ద‌విని ఆశిస్తున్నారు.  అనంతపురం జిల్లాలో అనంత వెంకట్రామిరెడ్డి, తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి ఉండగా... మహిళా కోటాలో ఉషశ్రీచరణ్‌, జనులగడ్డ పద్మావతి, ఎస్‌సి కోటాలో తిప్పేస్వామి పోటీ పడుతున్నారు. కర్నూలు జిల్లా నుంచి శిల్పా చక్రపాణిరెడ్డికి కేబినెట్ పోస్ట్‌ ఖాయమని ప్రచారం జ‌రుగుతోంది. ఆర్థిక మంత్రి బుగ్గనను సైతం తప్పిస్తుండటంతో రెడ్డి వర్గంతో పాటుగా బీసీ వర్గానికి ఈ జిల్లా నుంచి అవకాశం దక్కనుంది.  ఇలా, జిల్లాల వారీగా సామాజిక స‌మీక‌ర‌ణాల స‌మ‌తూకంతో ఏర్చికూర్చి మంత్రిమండ‌లి కూర్పు కోసం తీవ్ర క‌స‌ర‌త్తు చేస్తున్నారు సీఎం జ‌గ‌న్‌. జిల్లాల వారీగా బ‌లాబ‌లాలు, వచ్చే ఎన్నికలు, ప్రతిపక్షాలను ఎదుర్కొనే సామ‌ర్థ్యం ఇలా అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని సీఎం జగన్ తన ఎన్నికల కేబినెట్‌ను రెడీ చేస్తున్నారు. మ‌రి, ఈ కొత్త కేబినెట్ పార్టీలో అల‌క‌లు, అవ‌మానాల‌కు దారి తీస్తుందా? ఎన్నిక‌లకు ముందు అసంతృప్తులు త‌లెత్తితే ఏంటి ప‌రిస్థితి? ఇప్ప‌టికే జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై తీవ్ర ప్ర‌జావ్య‌తిరేక‌త ఉండ‌గా.. ఇక మంత్రి ప‌ద‌వి ద‌క్క‌ని బ‌ల‌మైన నేత‌లు జ‌గ‌న్ నిర్ణ‌యంపై ఎర్ర‌జెండా ఎగ‌రేసే ప్ర‌మాదం లేక‌పోలేద‌ని అంటున్నారు. అందుకే, ఈ కేబినెట్ ప్ర‌క్షాళ‌ణ సీఎం జ‌గ‌న్‌కు క‌త్తి మీద సామే...   
Publish Date:Sep 27, 2021

#SaveAPfromYSRCP ..జ‌గ‌న్‌పై జ‌న‌సేనాని ట్విట‌ర్ వార్‌

జ‌న‌సేనాని ప‌ట్టుకుంటే వ‌దిలే ర‌కం కాదు. బీజేపీ విష‌యంలో మాట‌త‌ప్పి, మ‌డ‌మ తిప్పినా.. వైసీపీ మేట‌ర్‌లో మాత్రం అస‌లే మాత్రం కాంప్ర‌మైజ్ కావ‌ట్లేదు. అటు, వైసీపీ ప్ర‌భుత్వమూ ప‌వ‌న్ క‌ల్యాణ్‌ను టార్గెట్ చేయ‌డంతో వారి మ‌ధ్య వైరం బాగా ముదిరింది. రిప‌బ్లిక్ ప్రీరిలీజ్ వేడుక‌లో పీకే చేసిన హాట్ హాట్ కామెంట్స్ మ‌రింత కాక రేపాయి. సినిమా ఇండ‌స్ట్రీ జోలికొస్తే కాలిపోతారంటూ ఖ‌త‌ర్నాక్ వార్నింగ్ ఇచ్చారు. స‌న్నాసులు, ద‌ద్ద‌మ్మ‌లంటూ దుమ్ము రేపారు. త‌న‌పై కోపం ఉంటే త‌న సినిమాల‌ను ఆపేయండి కానీ, మిగ‌తా వారిని ఇబ్బంది పెట్టొద్దంటూ చాలా చాలా స్ట్రాంగ్‌గా చెప్పారు. అయితే, ప‌వ‌న్ కామెంట్స్‌కు అదే రేంజ్‌లో కౌంట‌ర్లు ఇచ్చారు ఏపీ మంత్రులు. త‌మ‌కు ప‌వ‌న్‌క‌ల్యాణ్ అయినా, సంపూర్ణేష్‌బాబు అయినా ఒక్క‌టేనంటూ పీకేను త‌క్కువ చేసి చూపించే ప్ర‌య‌త్నం చేశారు. సినిమా టికెట్ల‌ను ఆన్‌లైన్ చేయాల‌నే ప్ర‌పోజ‌ల్ ఇండ‌స్ట్రీ నుంచే వ‌చ్చింద‌ని.. ప‌వ‌న్ నోరు జారితే బాగుండ‌దంటూ హెచ్చ‌రించారు. ఇలా, ప‌వ‌న్ క‌ల్యాణ్ వ‌ర్సెస్ ప్ర‌భుత్వం ఎపిసోడ్‌పై ఏపీలో ర‌చ్చ ర‌చ్చ జ‌రుగుతోంది.  ఆ వార్‌ను కంటిన్యూ చేస్తూ.. ట్విట‌ర్‌లో పెద్ద ఎత్తున క్యాంపెయిన్ స్టార్ట్ చేశారు ప‌వ‌న్ క‌ల్యాణ్‌. సేవ్ ఏపీ ఫ్రం వైసీపీ అంటూ.. హ్యాష్‌ట్యాగ్‌తో ట్రెండింగ్ చేస్తున్నారు. ప్రజల మీద పన్నులు రుద్ది, మద్యం ఆదాయం తాకట్టుతో అప్పులు చేస్తే అది సుపరిపాలన కాదు, సంక్షేమం అస్సలే కాదన్నారు. నేటి ‘నవ రత్నాలు’ భావితరాలకు ‘నవ కష్టాలు’ అంటూ ప్ర‌భుత్వం సంక్షేమ ప‌థ‌కాల పేరుతో చేస్తున్న మోసాన్ని ట్విట‌ర్ వేదిక‌గా చీల్చి చెండాడారు జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ల్యాణ్‌. ప‌నిలో ప‌నిగా.. ఇప్ప‌టి వ‌ర‌కూ వైసీపీ చేసిన వాగ్దానాలు.. ప్ర‌స్తుతం వాటి అమ‌లు ప‌రిస్థితిని చార్ట్ రూపంలో తేట‌తెల్లం చేశారు. అధికార పార్టీ హామీలైతే ఘ‌నంగా ఉన్నాయి కానీ, వాటి అమ‌లును మాత్రం అట‌కెక్కించేశారు అనే చేదు నిజం ప్ర‌జ‌లంద‌రికీ తెలిసేలా ఆస‌క్తిక‌ర చార్ట్‌తో ట్వీట్ చేశారు ప‌వ‌న్ క‌ల్యాణ్‌. ఆ పోస్ట్‌కు కూడా సేవ్ ఏపీ ఫ్రం వైసీపీ.. అంటూ హాష్‌ట్యాగ్ యాడ్ చేసి ట్రెండింగ్ చేస్తున్నారు జ‌న‌సైనికులు. 
Publish Date:Sep 27, 2021

కేబినెట్ మొత్తం క్లీన్‌స్వీప్‌.. మంత్రులు ఉన్నా ఒక‌టే, ఊడినా ఒక‌టేనా?

ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి మంత్రివర్గ ప్రక్షాళన కసరత్తుకు శ్రీకారం చుట్టారు. ప్రస్తుత మంత్రులలో కొద్ది మంది మినహా మిగిలిన అందరికీ ఉద్వాసన తధ్యమని చాలాకాలంగా పార్టీ వర్గాలలో చర్చ జరుగుతోంది. అలాగే, తొలి మంత్రివర్గ ప్రమాణ స్వీకార సమయంలోనే మంత్రివర్గాన్ని రెండున్నరేళ్ల తరువాత మారుస్తానని చాలా స్పష్టంగా చెప్పారు. ఇప్పుడు ఆ గడువు కూడా సమీపిస్తోంది. జ‌గ‌న్‌రెడ్డి 2019 మే 30న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ లెక్కన నవంబర్ 30, 2021తో రెండున్నరేళ్ళ గడువు ముగుస్తుంది. ఈ  నేపధ్యంలో ఫస్ట్ బ్యాచ్‌లో బెర్త్ మిస్సయిన సీనియర్లతో పాటుగా ఇతరత్రా ఈక్వేషన్స్’లో బెర్త్ ఆశిస్తున్న ఎమ్మెల్యేలు ఈసారి తమకు తప్పక అవకాశం దక్కుతుందని ఆశగా ఉన్నారు. మరోవంక ప్రస్తుత మంత్రుల్లో ఎవరు ఉంటారో, ఎవరు బయటకు వెళతారో అనే ఆందోళన నెలకొంది. తొలగించిన మంత్రులను పార్టీ నిర్మాణం కోసం వినియోగించుకుంటామని జగన్ గతంలోనే చెప్పారు.  అదలా ఉంటే, మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఒక్కసారిగా, ‘మంత్రివర్గంలో అందరినీ మార్చేస్తారు. వందశాతం మార్పు ఖాయం’ అంతా కొత్త వారినే తీసుకుంటారు అంటూ బాంబు పేల్చారు. మిగిలేది ముఖ్యమంత్రి ఒక్కరే, మిగిలిన అందరికీ ఉద్వాసన తథ్యం అంటున్నారు. స్వయంగా ముఖ్యమంత్రే తనకు ఈ విషయం చెప్పారని బాలినేని ముక్తాయింపు నివ్వ‌డం మ‌రింత సంచ‌ల‌నంగా మారింది. దీంతో ఇంత వరకూ తమ కుర్చీకి డోకా లేదని ధీమాగా ఉన్న సీనియర్లు, ముఖ్యమంత్రి దగ్గర మంచి మార్కులు కొట్టేశామని కొందరు జూనియర్లు కూడా, ఇప్పడు మంత్రి బాలినేని స్టేట్మెంట్’తో కంగారు పడుతున్నట్లు సమాచారం. నిజానికి, కొద్ది రోజుల క్రితం వరకు కూడా కనీసం ఒక అరడజను మంది వరకు ‘సేవ్’ అవుతారని అనుకున్నారు. కానీ, బహుశా గుజరాత్’లో బీజేపీ అధినాయకత్వం ముఖ్యమంత్రితో సహా మొత్తం మంత్రివర్గానికి ఒకేసారి ఉద్వాసన పలికిన నేపథ్యంలో జగన్‌రెడ్డి కూడా మనసు మర్చుకున్నారో ఏమో, అనే మాట పార్టీలో వినవస్తోంది. మరోవంక మంత్రి బాలినేని  మొత్తానికి మొత్తం మంత్రులు  అందరికీ ఒకేసారి ఉద్వాసన పలికే నిర్ణయం నూటికి నూరు శాతం చక్కని, సముచిత నిర్ణయమని ప్రకటించారు.   అయితే, మంత్రులను మార్చి ప్రయోజనం లేదని, ముఖ్యంత్రిని మారిస్తేనే కానీ, రాష్ట్రానికి మేలు జరగదని విపక్షాలు ఎద్దేవా చేస్తున్నాయి. సర్వ అనర్ధాలకు మూలమైన ముఖ్యమంత్రిని వదిలేసి మంత్రులను తొలిగించినా, తొలిగించక పోయినా ఒకటేనని విపక్షాలు అంటున్నాయి. “ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మార్చాల్సింది మంత్రులను కాదు, ముఖ్యమంత్రిని మార్చాలి” అని కాంగ్రెస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌ తులసిరెడ్డి అన్నారు. జగన్ పాలనలో మంత్రులు ఉత్సవ విగ్రహాలని, ఆరవ వేలుతో సమానమని విమర్శించారు. వారు మంత్రులుగా ఉన్నా ఒకటే.. ఊడినా ఒకటేనన్నారు. ప్రస్తుతం ఏపీలో సమస్య ముఖ్యమంత్రి జగనేనన్నారు. రాష్ట్రం అప్పులు, అరాచకం, అవినీతి, అసమర్ధత, ఆటవిక ఆంధ్రప్రదేశ్‌గా మారిందని, వీటన్నిటికీ మూలకారకుడు ముఖ్యమంత్రి అని తుల‌సీరెడ్డి  అన్నారు. జగన్‌ని మారుస్తే తప్ప ఆంధ్రప్రదేశ్ సమస్యలు పరిష్కారం కావని ఆయన కుండబద్దలు కొట్టారు.  ముఖ్యమంత్రిగా జగన్ రెడ్డిని మార్చకుండా మంత్రులను మార్చడం అంటే... చేతగాని వైద్యడు పంటినొప్పికి తుంటి మీద తన్నినట్లేనని తులసిరెడ్డి తమదైన స్టైల్లో వ్యగ్య బాణాలు వేశారు. నిజానికి, ఏపీలో మంత్రులు పేరుకు మంత్రులే కానీ, వారికి ఉన్న అధికారాలు అంతంత మాత్రమే. సో రాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్యలకు ముఖ్యమంత్రి మార్పు ఒక్కటే పరిష్కారం అనేది సరైన ఆలోచనే అవుతుందని విశ్లేషకులు సైతం అంటున్నారు.  
Publish Date:Sep 27, 2021

మహిళలూ జాగ్రత్త!!

ఈ ప్రపంచంలో ప్రతిరోజూ ఎక్కడో ఒక చోట ఏదో ఒక సంఘటన ఆడపిల్ల గురించి దారుణాలు వినబడుతూనే ఉన్నాయి. ప్రభుత్వాలు ఆ దుర్ఘటన తాలూకూ అనుభవాల నుండి ఏదో ఒక చట్టాన్ని చేస్తూనే ఉంది. ఎన్ని చట్టాలు చేసినా ఆడపిల్లల మీద అమానుష సంఘటనలు మాత్రం ఆగడం లేదు. అంతకంతకూ పెరుగుతూనే ఉన్నాయి. ఈ విషయంలో గొంతు చించుకొని ఎంత ఆవేదన వెలిబుచ్చినా అదంతా గాలిగీతంలా క్షణానికే మాయమవుతోంది. మరి ఇలాంటప్పుడు ఆడపిల్లలు బయటకు ఎక్కువ వెల్లకపోవడం మంచిదని చాలామంది చెబుతారు. కానీ భవిష్యత్తును వదులుకోవడం ఎంతవరకు సమంజసం అనిపిస్తుంది మరి. అయితే అమ్మాయి బయటకు వెళ్లి క్షేమంగా తిరిగి ఇంటికి రావడం అనేది ప్రతి తల్లిదండ్రిలో ప్రతీరోజును ఒక భయానక కాలంగా మార్చేస్తోంది. అలా కాకుండా తమ ఇష్టాలను లక్ష్యాలను  ఏమాత్రం విడిచిపెట్టకుండా, ఇంట్లో వాళ్లకు భరోసా ఇవ్వగలిగే కొన్ని జాగ్రత్తలు ఉన్నాయి. వాటిని ఫాలో అయితే ఎలాంటి చీకు చింతా ఉండవు. దగ్గరగా…. దగ్గరగా….. చదువుకునే పిల్లల నుండి ఉద్యోగం చేసే అమ్మాయిలు, మధ్యవయసు ఆడవాళ్లు ఇలా అందరూ చూసుకోవాల్సిన మొదటి ఎంపిక స్కూల్ లేదా కాలేజి లేదా ఆఫీసు వంటివి దగ్గరలో ఉండేలా వాటికి దగ్గరలో ఇల్లు, లేదా హాస్టల్ చూసుకోవడం. దీనివల్ల అక్కడ కాస్త ఆలస్యం అయినా ఇంటికి చేరుకునే సమయం తక్కువే కాబట్టి పెద్దగా భయపడనవసరం లేదు.  కొంచం టచ్ లో ఉంటే బాగుంటుంది దూరబార ప్రయాణాలు, సిటీ లోనే కాలేజ్ లు, స్నేహితులతో ఎక్కడికైనా దూరం వెళ్లడం వంటి సందర్భాలలో ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులకు ఎవరికో ఒకరికి లైవ్ లొకేషన్ షేర్ చేయాలి. అంతేకాదు రాత్రి పూట తప్పనిసరి అయి ఆటో లు, క్యాబ్ లు ఎక్కాల్సి వచ్చినప్పుడు కూడా లైవ్ లొకేషన్ షేర్ చేయాలి. నమ్మకానికి ఆమడదురం ఈ కాలంలో ఎవరిని నమ్ముతాం పూర్తిగా. కాలమే మారిపోతూ ఉంటుంది అలాంటపుడు మనుషులు మారకుండా ఉంటారా. అలాగని ఎప్పుడూ అనుమానంతో ఉండమని కాదు. అతినమ్మకం ఉండకూడదు అని. కాబట్టి ఎవరిని వారు పూర్తి విమర్శ చేసుకుని అప్పుడు అవతలి వారిని నమ్మాలి. ఏదో మోహమాటానికి పోయి సమస్యలలో చిక్కుకోవద్దు సుమా!! స్వీయ రక్షణే కొండంత భరోసా ఇప్పటికాలం ఆడపిల్లలకు మగపిల్లలతో సమానంగా మార్షల్ ఆర్ట్స్, బాక్సింగ్ వంటి విద్యలు నేర్పడం వల్ల శారీరక దృఢత్వం మాత్రమే కాకుండా ప్రమాదంలో ఉన్నపుడు అవే కొండంత భరోసా ఇస్తూ తమని తాము కాపాడుకునేలా చేస్తాయి.  అంతే కాదండోయ్ ఆడపిల్లలు ఆటలలో చురుగ్గా ఉంటే వారు ఎంతో దృఢంగా తయారవుతారు. అదే వారికి స్వీయ రక్షణ గా తోడ్పడుతుంది కూడా. డోంట్ టచ్…. ఇప్పట్లో మొబైల్స్ ను చాలా సులువుగా హాక్ చేసేస్తారు. వాటి ద్వారా, బ్యాంక్ అకౌంట్స్ మాత్రమే కెమెరా ఆక్టివేట్ చేసి అమ్మయిల ఫొటోస్, వీడియోస్ రికార్డ్ చేసి బ్లాక్మైల్ చేసి డబ్బు గుంజుతూ పైశాచికానందం పొందుతుంటారు. ఇలాంటి సంఘటనలు చాలా  తక్కువగా బయటపడుతుంటాయి. కాబట్టి తెలియని వాళ్లకు ఫోన్ ఇవ్వడం వంటివి చేయకూడదు. ఎవరైనా మీ వస్తువులను ముట్టడానికి ప్రయత్నం చేసినా సున్నితంగా డోంట్ టచ్ అని చెప్పేయండి. ఒకవేళ హెల్పింగ్ నేచర్ ఉన్నా తెలియని వ్యక్తులు అడిగినప్పుడు ఒక చిన్నపాటి కీప్యాడ్ మొబైల్ ఇవ్వడం ఉత్తమం.  సోషల్ మీడియా ఎంత మంచి చేస్తుందో చెడు కూడా చేస్తుంది. కాబట్టి తెలివిగా దాన్ని ఉపయోగించుకోగలగాలి. ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిన దిశ యాప్ లాంటివి సమర్థవంతంగా ఉపయోగించుకోవాలి. రాత్రి పూట ప్రయాణాలలో వీలైనంతవరకు నిద్రను అవాయిడ్ చేయాలి. ప్రయాణం చేసి బస్ లేదా ట్రైన్ వంటివి దిగే  సమయానికి ఆయా స్టాప్ లలో కుటుంబసభ్యులు లేదా స్నేహితులు, లేదా చుట్టాలు ఇలా ఎవరో ఒకరు అక్కడికి చేసురుకుని రిసీవ్ చేసుకునే ఏర్పాటు చేసుకోవాలి.  దేన్నీ నిర్లక్ష్యంగా చూడద్దు. అమ్మాయిలు బయటకు వెళ్లినప్పటి నుండి తిరిగి ఇంటికి చేరుకునేదాకా స్పృహతో ఉండాలి. పరిసరాలను గమనిస్తూ ఉండాలి.  కాలంతో పాటు ఎన్నో అభివృద్ధి చెందుతున్నాయి. అలాగే మహిళల విషయంలో సమాజం దిగజారిపోతోంది. కాబట్టి జగరూకత ఎంతైనా అవసరం. ◆ వెంకటేష్ పువ్వాడ
Publish Date:Sep 27, 2021

తాజా హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ టెక్నాలజీ...

కొందరికి గుండు ఉంటేనే ఇష్టం ఇంకొందరికి జుట్టు ఉంటేనే ఇష్టం ఎవరి ఇష్టా ఇష్టాలు ఎలా ఉన్నా అసలు జుట్టు రాలిపోడానికి ప్రదాన కారణాలు ఏమిటి అన్న అంశాన్ని కనుక్కోవాలని శాస్త్రజ్ఞులు నిర్ణ యించారు. అయితే ఇప్పుడు కొందరికి బట్ట తల వరంగా మారిందని కొత్తాన్దాన్ని తెచ్చిందని,సెక్సీగా ఉంటారని.రకరకాల వ్యాఖ్యలు చేస్తున్నారు. జుట్టు ఊది పోయినందుకు తమకు బాధలేదని అంటున్నారు కొందరు. దీనికోసం మరిన్ని ప్రత్యామ్నాయాలు వెతకాలని బట్టతలకు ప్రాధమిక కారణాలు ఏమిటో గుర్తించలేదని ఆక్సిడెటివ్ టేస్ట్,సరిగా రక్తప్రసారం జరగక పోవడం పరిశోధకులు అందించిన వివరాల ప్రకారం ఆక్స్ నానో ప్రిలిమనరీ మైక్రో నీడిల్ ప్యాచ్ సీరియం నానో పార్టికల్ రెండు సమస్యల పై పోరాడుతుందని. జుట్టు పునరుత్పత్తి చేయవచ్చు.ఈ ప్రయోగాన్ని ఒక ఎలుకపై నిర్వహించారని తెలిపారు. సహజంగా బట్టతలకు ప్రధాన కారణం అలోఫెషియా పురుషులు ఇబ్బంది పడుతున్నారు. స్త్రీలలో వచ్చే బట్టతల జుట్టు రాలిపోవడం అది శాస్వతంగా ఉండిపోతుంది.ఆయా చుట్టూ పక్కల ప్రాంతలాలో రక్తకణాలు సరిగా ఉండకపోవడం లేదా రక్త ప్రసారం సరిగా లేక పోవడం సంభవిస్తుంది. ఫాలికల్స్ న్యుట్రియాంట్స్ విడుదల చేయడం.సీటో కిన్స్ ఇతర మాలిక్యుల్స్ ఇతర ఆక్సిజన్ అందక పోవడం సరిగా అందాక పోవడం వల్ల సెల్ల్స్ మరణిస్తాయి.దీనివల్లే కొత్తగా మొలవక పోవడానికి కారణాలుగా గుర్తించారు.గతంలో ఫ్యంగ్ హ్యువన్ లి జియాన్ క్వింగ్ జ్యంగ్వో అతని మిత్ర బృందం సీరం నానో పార్టికల్స్ ఉన్నాయని. మిమిక్ ఎంజాయం లలో అదనంగా ఉన్న ఆక్సిజన్ వల్ల వచ్చే ఒత్తిడి వల్ల లివర్ ఇంజురీ గాయాలు,అల్జీమర్స్ వ్యాధులకు కారణం అవుతోంది.ఏది ఏమైనా నానో పార్టికల్స్ చర్మం దాటి బయటికి పోవు.మినిమిల్లి ఇంవిజివ్ పద్దతిలో సీరం నానో పార్టికల్స్ ను రూపొందించే పనిలో పడ్డారు.సీరం నానో పార్టికల్స్ జుట్టు మొదళ్ళ నుండి  చర్మం లోపలికి పంపడం ద్వారా జుట్టును మరల మోలిపించవచ్చు.మొదటి దశలో పరిసోదకులు సీరం నానోపార్టికల్స్ బయో డి గ్రేయబుల్ పోలితిలిన్ గ్లైకో లైపిడ్ కాంపౌండ్ ను ఆతరువాత దిజాల్వే అయ్యే మైక్రో నీడిల్ ప్యాచ్ ప్రరాలురోనిక్ యాసిడ్ మా నవ చర్మానికి ప్రత్యామ్నాయంగా సీరం నానో పార్టికల్స్ ఒక మోల్డ్ గా తయారు చేస్తారు.పరిశోధకులు ప్యాచ్ ను సీరం కొంటైనింగ్ నానోపాట్టికల్ ను ఒక ఎలుకపై వేసినప్పుడుజుట్టు త్వరగా పెరగడాన్ని గమనించినట్లు చాలా తక్కువసమయంలో వాటిని అప్లయ్ చేయడం ద్వారా నానోపాటికల్ ను చర్మం లో చొప్పించడం అలోఫేషియా రోగులకు శుభావార్తగా చెప్పవచ్చు. ఈ పరిశోదనను జెజియాంగ్ ప్రావిన్స్ నేషనల్ కీ ఆర్ అండ్ డి ఆఫ్ చైనా నేషనల్ నే చ్యురల్ సైన్స్ ఫౌండేషన్ ఈ అంశం పై పరిశోదనలు కొనసాగిస్తున్నారు.కొత్త శాస్త్రీయ పద్దతితో జుట్టు పునరుత్పత్తి చేయవచ్చని శాస్త్రజ్ఞులు చేసిన ప్రయోగం త్వరలో అందుబాటులోకి వస్తుందని ఆశిద్దాం.  
Publish Date:Sep 27, 2021